మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. అమెరికన్ ఫుడ్ కంపెనీ సన్నాహాలు..

|

Nov 11, 2021 | 12:43 PM

అమెరికాకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ హీంజ్ కచప్ తయారీలో సరికొత్త వెర్షన్‏ను సిద్ధం చేసింది. ఈ కచప్ అంగారక గ్రహంపై ఉన్న మట్టిలో పెరిగిన టమోటాల నుంచి తయారు చేయబడుతుంది.

1 / 6
అంగారక గ్రహంపై మానవులు నివసించే వీలైనటువంటి ప్రాంతాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. భూమిపై నేల మాదిరిగా కాకుండా అంగారక గ్రహంపై పంటలు చాలా కష్టం.

2 / 6
మార్స్ మట్టిని మార్టిన్ రెగిలిత్ అంటారు. అంగారక గ్రహం మట్టిలో సేంద్రియ పదార్థాల ఉనికి లేదు. సూర్యకాంతి కూడా అంగారకుడిపై తక్కువగా చేరుతుంది. అక్కడ టమోటాలను పండించేందుకు హీన్జ్ కొత్త పద్దతులను కనుగొంది.

3 / 6
ఇందుకు మానవులు అంగారక గ్రహంపై పంటలను పండించాల్సి ఉంటుంది. ఇందుకోసం హీన్జ్ కంపెనీలోని బృందం.. మార్స్ వంటి గ్రీన్ హౌస్ వాతావరణాన్ని సృష్టించింది. అందులో మార్స్ మట్టిని ఉపయోగించింది. చివరకు అందులో టమోటాలను పండించి వాటిని కచప్‏గా మార్చారు.

4 / 6
భూమిపై వాతావరణ మార్పుల వలన పంటలు పండడం చాలా కష్టంగా మారుతుందని ఆ బృందం చెబుతుంది. నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినో.. ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు సుపరిచితమైన రుచిని కలిగి ఉంటుంది.

5 / 6
హీన్జ్ టమోటాల ద్వారా కొత్త మార్స్ ఎడిషన్ కచప్ ను సిద్దం చేసింది. ఈ కచప్ రుచి సాధారణ వెర్షన్ కంటే భిన్నంగా ఉంటుందని తెలిపింది. హీన్జ్ మార్స్ వెర్షన్ కచప్ బాటిల్లను అంతరిక్షంలో పంపారు. అక్కడ ఈ బాటిల్ -94 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంది. ఆ తర్వాత తిరిగి భూమి పైకి తీసుకువచ్చారు.

6 / 6
హీన్జ్ లోని టమోటా మాస్టర్స్ భవిష్యత్తులో అంగారక గ్రహానికి వచ్చే సందర్శకులు గ్రహం మట్టిలో టమోటాలు పండించడం ద్వారా కచప్ తయారు చేయగలరో లేదో తెలుసుకోవడానికి ఒక మిషన్‏ను ప్రారంభించారు. ఇందుకోసం అత్యుత్తమ విత్తనాలను తీసుకుని ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పంటలు పండించారు.