మట్టితో కుండలుగా ఇళ్లు నిర్మించుకుంటున్న జనం.. ఖరీదైన దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా..

|

Dec 08, 2021 | 1:10 PM

ఖరీదైన దేశం.. ఎన్నో అంతస్తుల భవనాలు.. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు మట్టితో కుండ ఆకారంలో చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఇలాంటి పరిస్థితి ఇటలీలో ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా.

1 / 5
ఇటలీలోని రవెన్నా నగరంలో కుండల మాదిరిగా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. అవి మట్టితో చేసిన 3డీ ప్రింటెడ్ ఇళ్లు. ఇవి ఇక్కడ దశాబ్ధాల నాటి నాగరికతను చూపిస్తున్నాయి. ఈ ఇళ్లను టెల్కా హౌస్ అంటారు.. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో కేవలం 200 గంటల్లోనే ఈ ఇళ్లను రెడీ చేస్తారు. లివింగ్ రూమ్, బాత్ రూమ్, బెడ్ రూమ్‏తో కూడిన ఈ డోమ్ హౌస్‏లలో అనేక సౌకర్యాలు ఉన్నాయి.

2 / 5
ఈ ఇళ్లను నిర్మించాలనే ఆలోచన ప్రముఖ ఆర్కిటెక్ట్ మారియో కుసినెల్లాకు వచ్చింది. కొత్త టెక్నాలజీకి మట్టిని చేర్చి ఈ ఇళ్లను నిర్మించారు. పురాతన కాలంలో మట్టితో ఇళ్లు ఉండేవని..ఇప్పుడు సాంకేతికతకు అనుగుణంగా ఈ త్రీడీ ప్రింటింగ్ సాయంతో ఇళ్లను నిర్మించినట్టు మారియో చెప్పారు.

3 / 5
వీటిని నిరాశ్రయులైన లేదా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోంటున్నవారు.. లేదా ఇళ్లు లేనివారికి ఇవ్వనున్నారు. అలాంటి వారి కోసం డోమ్ హౌస్ ఉపయోగపడుతుందని.. రాబోయే కాలంలో తక్కువ ఖర్చుతో ఈ ఇంటిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎకో హౌస్.

4 / 5
అలాగే ఆర్కిటెక్ట్ మారియో మాట్లాడుతూ.. 645 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు సిద్ధం చేయబడింది. ఇది రెండు పొరలతో తయారు చేయబడింది. ఇందులో ఇంటికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే ప్రకృతి విపత్తుల ఈ ఇళ్లు కూలిపోతే వాటిని 3డీ ప్రింటింగ్ ద్వారా తిరిగి నిర్మించవచ్చని మారియో తెలిపారు.

5 / 5
 విపత్తు సంభవించే ప్రాంతాలకు ఇటువంటి ఇళ్లు మంచి ఎంపిక అని మారియో తెలిపారు. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే.. అప్పుడు గోడల పొరను మరింత పెంచవచ్చని.. జీరో కార్బన్ నిర్మాణం ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయబడినట్లుగా చెప్పారు. భవిష్యత్తులో ఈ ఇళ్లు మంచివని.. ఈ ప్రాజెక్ట్ వాతావరణ మార్పుల సదస్సులో కూడా ప్రదర్శించబడినట్లు చెప్పారు.