జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే..

|

Jan 10, 2025 | 9:02 AM

అందరికీ తల మీద వెంట్రుకలు నిరంతరం ఒకేలా ఉండవు. అవి నిరంతరం పుట్టి, పెరిగి, రాలిపోతుంటాయి. జుట్టు అసహజంగా రాలిపోవడం చాలామందిలో కనిపిస్తుంది. ఈ సమస్యను ఆరోగ్య సమస్యగా గుర్తించకుండా సౌందర్య సమస్యగా భావించరాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, ఇది పోషకాహార లోపం, హార్మోనుల సమస్యలు, మానసిక ఆందోళనలు, నిద్రలేమి, వంశపారంపర్య సమస్యలు, వ్యాధులు, మందుల వాడకం వంటి కారణాలతో జుట్టు రాలిపోవడం ఎక్కువగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
సహజసిద్ధంగా వెంట్రుకలు ఊడిపోవడం సాధారణమే అయినా శరీర జీవ క్రియలలో మార్పుల వల్ల జుట్టు రాలిపోతుంటే అది అనారోగ్యంగా భావించాలి.  స్త్రీలలో సాధారణంగా గర్భధారణ తర్వాత హార్మోన్లు పెరగడం వల్ల జుట్టు కూడా పెరుగుతుంది. ప్రసావానంతరం హార్మోన్లు తగ్గి అందులో అసమతుల్యత కారణంగా, ప్రసవం తర్వాత ఆర్నెల్ల వరకు జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

2 / 5
స్త్రీలలో అధిక రుతుస్రావం వల్ల కూడా ఐరన్‌ లోపంతో జుట్టు రాలిపోవచ్చు. శరీరంలో తలపై ఉన్న జుట్టు మొత్తం రాలిపోతే అలోపిషియా టోటాలిస్, శరీరంపై వెంట్రుకలన్నీ రాలిపోతే అలోపిషియా యూనివర్షాలిస్ అంటారు.

3 / 5
ఒక్కోసారి ఏ కారణంల లేకుండా తలలో ఒక భాగంలో జుట్టు ఊడిపోయి మచ్చలా ఏర్పడుతుంది. క్రమంగా తలలో ఇతర భాగాల్లో కూడా ఇలా జరగొచ్చు. దీనిని అలోపిషియా ఏరియేటా అంటారు. గడ్డాలు, మీసాలు, కనుబొమ్మల్లో కూడా ఇలా జరగొచ్చు.

4 / 5
టైఫాయిడ్ వంటి దీర్ఘకాలిక జ్వరాలు, ప్రొటీన్స్‌, ఐరన్ లోపం, విటమిన్ ఎ ఎక్కువగా వాడినా జుట్టు రాలే సమస్యలు రావచ్చు.  దీర్ఘ కాలిక వ్యాధులు, క్యాన్సర్లలో జుట్టు రాలిపోయే సమస్య కనిపిస్తుంది. వివిధ రకాల మందుల వల్ల  కూడా  జుట్టు బాగా రాలిపోతుంది. తలలో వచ్చే ఇన్‌‌ఫెక్షన్ల వల్ల కుదుళ్లు దెబ్బతిని జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.

5 / 5
రకరకాల మందుల వల్ల కూడా జుట్టు రాలడం సమస్యలు వస్తాయి. జుట్టును బిగుతుగా కట్టడం, షాంపులు అధికంగా వాడటం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఎక్కువగా దువ్వెనతో దువ్విన జుట్టు కుదుళ్లకు నష్టం కలుగుతుంది. దువ్వెన దంతాలు మృదువుగా ఉండాలి. బహిష్టు ఆగిపోయిన స్త్రీలలో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ వల్ల జుట్టు తగ్గిపోవడం జరుగుతుంది.