
వేసవికాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి చల్లని పానియాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇందులో కొబ్బరి నీళ్లు సహజంగా స్వచ్ఛమైనది. పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి.

ఇందులోని పోషకాలు అధిక చెమట, అలసట, నీరసం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేసవికాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర అవసరాలు తీర్చడంతోపాటు జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. కనుక వేసవిలో ద్రవాలతో పాటు ద్రవాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

కొబ్బరినీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గడంతో పాటు శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి. ఇది సహజమైనది, ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వేసవికాలంలో ఎండలో ఎక్కువగా తిరిగిన తరువాత కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది.

చెమట కారణంగా శరీరం ముఖ్యమైన ఖనిజాలను కోల్పోతుంది. కొబ్బరి నీటిని తాగడం వల్ల పొటాషియం, సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్ తిరిగి శరీరానికి అందుతాయి. శరీరంలో ద్రవసమతుల్యం పునరుద్దరిస్తుంది.

అలాగే కండరాల నొప్పులు తగ్గుతాయి. కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. అలసట, చర్మంపై రాషెస్, తలనొప్పి వంటి ఎండ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. శరీర సంరక్షణ ఉత్పత్తులకు బదులు కొబ్బరి నీటిని తాగడం మంచిది.