Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..!

|

Oct 31, 2024 | 1:09 PM

డ్రాగన్ ఫ్రూట్.. ఎర్రటి చర్మంతో పసుపు లేదా తెల్లని మాంసం కలిగి ఉండే ఈ పండు అద్భుతమైన పోసకాల నిధిగా పిలుస్తారు. లోపల చిన్న చిన్న నల్లటి గింజలు కూడా ఉంటాయి. ఇది రుచికి కివి, పియర్ కలయికలా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ మెక్సికో మధ్య అమెరికా దేశాలకు చెందినది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పెరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు, వ్యాపారం జోరందుకుంటోంది. ఇకపోతే, డ్రాగన్‌ ఫ్రూట్‌లో శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్యలాభాలు నిండివున్నాయి. అనేక అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
డ్రాగన్ ఫ్రూట్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

2 / 5
డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మనకు ఎక్కువ సేపు పూర్తిగా భావించేలా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని వృద్ధాప్యం నుండి కాపాడుతాయి. ముఖ్యంగా, ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, మృదువుగా చేస్తుంది.

3 / 5
డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కణాలను రక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు..డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి.

4 / 5
డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చాలా ఆరోగ్యకరమైన పండు అయినప్పటికీ, కొంతమందికి ఇది సరిపడకపోవచ్చు.

5 / 5
ఏదైనా ఆహారానికి అలర్జీ ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్‌ను తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. అలాగే, కొన్ని రకాల మెడిసిన్స్‌ వాడేవారిలో డ్రాగన్ ఫ్రూట్‌తో ఇతర రియాక్షన్‌ చూపించవచ్చు. కాబట్టి, ఏదైనా ఔషధం తీసుకుంటున్నట్లయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎక్కువగా తీసుకున్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కొన్నిసార్లు జీర్ణ సమస్యలను కలిగించవచ్చు.