
మనలో చాలా మంది ఈ పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధ. మీరు ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తగ్గించుకోవచ్చు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

పులిపిర్లు సమస్యతో బాధ పడేవాళ్ళు ఇంటి చిట్కాలతో ఈ సమస్యను తగ్గించవచ్చు. పులిపిర్లు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వస్తుంది. ఇవి అస్సలు వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. వీటి ఆకారం కూడా భిన్నంగా ఉంటాయి శరీరమంతటా ఎన్నో ఆకారాల్లో శరీరంపైన వస్తుంటాయి దీని వలన కొందరు బయటకు కూడా రారు.

పులిపిర్లు వచ్చిన వెంటనే కొందరు కంగారు పడి కొన్ని క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలు మంచిగా పనిచేస్తాయి. అయితే, మీరు వీటిని శ్రద్ద చేసుకుంటే కొద్దీ మొత్తంలోనే మంచి పలితాలను చుస్తారు.

అన్నింటి కంటే పసుపు బాగా పని చేస్తుంది. ఒక స్పూన్ ఆవునెయ్యిలో కొద్దిగా మిరియాల పొడి వేసి తీసుకోవాలి. ఇంకా రాగి పాత్రలో వేసి తులసి ఆకులు వేసి ఒక రాత్రి మొత్తం అలా వదిలేసి ఆ తరవాత రోజు ఉదయం ఈ ఆకులను నములుతూ నీటిని తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అయితే, మీరు దీనిని పాటించే ముందు వైద్యుని వద్దకు వెళ్ళి సలహాతోనే తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)