108 ఏళ్ల వ్యక్తికి పెళ్లి..! వధువు వయసేంతో తెలుసా?

Updated on: Apr 04, 2025 | 5:06 PM

108 ఏళ్ల కరియప్ప, 98 ఏళ్ల గోపమ్మ దంపతులు తమ 60వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పూర్తిగా ఆచారబద్ధంగా, పాతకాలపు వివాహ పద్ధతులతో నిర్వహించిన ఈ వేడుకలో పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వృద్ధ దంపతుల ఆరోగ్యం, బలం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వేడుక వారి కుటుంబానికి, గ్రామానికి ఒక అపురూపమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

1 / 5
పైల్వాన్ దంపతులు తమ 60వ షష్టి సందర్భంగా మళ్ళీ వివాహం చేసుకున్నారు. వయసు పెరుగుతున్నప్పటికీ ఈ జంట బలంగా ఉన్నారు. నేటి యువతరం యంగ్‌ ఏజ్‌లో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ జంట పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లు, గ్రామస్తులలో సమక్షంలో షష్ఠి వేడుకలు జరుపుకున్నారు.

2 / 5

3 / 5
ఆచారబద్ధంగా ఈ వేడుకలు నిర్వహించారు. కరియప్ప వయసు 108, ఆయన భార్య గోపమ్మ వయసు 98. మరో రెండేళ్లలో గోపమ్మ 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. 108 సంవత్సరాల వయస్సులో కూడా  పైల్వాన్ కరియప్ప చాలా బలంగా ఉన్నారు.  ఆ దంపతులకు పిల్లలు, మనవరాళ్ళు, మునిమనవళ్లతో సహా 40 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు.

4 / 5
పైల్వాన్ దంపతులు తమ పిల్లలు, మనవరాళ్ళు బంధువులతో కలిసి తమ 60వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటూ మళ్ళీ వివాహం చేసుకున్నారు. ఈ విధంగా, వారు మునుపటి రోజు జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందించారు. ఈ పెళ్లి వేడుక చూసేందుకు చాలా మంది వచ్చారు. ఆహ్వానం అందకపోయినా వచ్చిన వారు చాలా మంది ఉన్నారంట..

5 / 5
వివాహంలో ఉండే అన్ని ఆచారాలను పాటించారు. మరో విశేషం ఏంటంటే.. అన్ని పాత కాలం పద్ధతుల్లోనే.. గతంలో వారి పెళ్లి ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే చేసుకున్నారు. తాళి కట్టడం, పెళ్లిలో అరుంధతి నక్షత్ర దర్శనం చేసుకోవడం, గాజులు ధరించడం వంటి అనేక ఆచారాలతో ఆ వృద్ధ జంటను మళ్ళీ సంతోషంగా వివాహం చేసుకున్నారు.