వామ్మో.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? బాడీ షెడ్డుకు పోతున్నట్లే.. నెగ్లెట్ చేయకండి

|

Jan 14, 2025 | 8:36 PM

శరీరంలో కొలెస్ట్రాల్ ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య.. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను ముందుగానే గుర్తిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. శరీరంలోని కొన్ని భాగాలలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

1 / 6
శరీరంలో కొలెస్ట్రాల్ ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య.. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను ముందుగానే గుర్తిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు.. అందుకే.. కొలెస్ట్రాల్ పెరుగుదలను సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటారు.. అయితే.. మీరు మీ వేలు గోర్ల (గోళ్లు) ను చూడటం ద్వారా మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను గుర్తించవచ్చు. ముందే.. తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. రక్త ప్రసరణకు ఆటంకం కలిగితే ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. వాస్తవానికి.. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది.. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్.. చెడు కొలెస్ట్రాల్‌ను LDL అంటారు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే లక్షణాలు త్వరగా కనిపించవు.. ఇది రక్త నాళాలలో పేరుకుపోతుంది.. శరీరంలోని కొన్ని భాగాలలో దాని లక్షణాలను చూపుతుంది. అవేంటో తెలుసుకోండి..

2 / 6
గోర్లు పసుపు రంగులోకి మారడం:  గోర్లపై పసుపు రంగు మచ్చలు ఏర్పడటాన్ని శాంతోమాస్ అంటారు. మీ గోరు ఇలా పసుపు రంగులోకి మారినట్లయితే, మీ శరీరంలో హానికరమైన కొవ్వు పేరుకుపోయినట్లు అర్థం.. గోర్లకు రక్త ప్రసరణ తగ్గితే గోరు పసుపు రంగులోకి మారుతుంది. ఇది సాధారణంగా అధిక LDL కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తుల లక్షణం. ఈ పసుపు మచ్చలు గోర్లు, మోచేతులు, గోళ్ల మధ్య, కొంతమందిలో ఎడమ లేదా కుడి కాలు మీద కనిపిస్తాయి.

3 / 6
గోర్ల రంగు మారడం: గోర్లకు రక్తప్రసరణ సరిగా జరగకపోతే గోళ్లు నీలం రంగులోకి మారుతాయి. గోర్లు నీలం రంగులోకి మారితే రక్తనాళాల్లో సమస్య ఉందనడానికి సంకేతం. కాబట్టి మీ గోర్లు నీలం రంగులోకి మారితే మీ శరీరంలో కొవ్వు పెరిగిందని అర్థం.

4 / 6
గోర్లలో నొప్పి: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడితే గోర్లలో నొప్పి ఉండటంతోపాటు మంట ఉంటుంది. కాబట్టి గోర్లలో నొప్పి వస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.

5 / 6
కోల్డ్ నెయిల్: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, శరీరంలోని అనేక భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరగకుండా చేస్తుంది.. తద్వారా, సరైన రక్త ప్రవాహం లేకుండా, వేలు గోర్లు చల్లగా మారుతాయి.. రక్త ప్రసరణ దాదాపుగా ఆగిపోయినప్పుడు, గోర్లు చల్లగా, నిర్జీవంగా మారుతాయి.

6 / 6
గోర్లపై నల్లటి గీత:  ఈ లక్షణం కొందరిలో కనిపిస్తుంది. గోళ్లపై డార్క్ స్ట్రీక్స్ శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌కు సంకేతం. దీనినే స్ప్లింటర్ హెమరేజ్ అంటారు. ఈ నల్లటి గీతలు గోర్లపై కనిపిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది.