Redmi A3: రెడ్‌మీ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. వాలెంటైన్స్ డే రోజు లాంచింగ్‌.

|

Feb 09, 2024 | 11:01 PM

మార్కెట్లో ప్రస్తుతం బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకోస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు...

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ కంపెనీ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీఏ3 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన లాంచ్‌ చేయనున్నారు.

2 / 5
రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.71 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1600X720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

3 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ 2.2 జీహెచ్‌జెడ్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ36 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12ఎన్‌ఎమ్‌ ప్రాసెస్‌ టెక్నాలజీని ఇందులో అందించారు. ఇక ఈ ఫోన్‌ 4జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది.

4 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 4జీబీ, 6జీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు ఇంటర్నల్‌ మెమోరీని పెంచుకోవచ్చు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. బ్లూటూత్‌ 5.0, ఎఫ్‌ఎమ్‌రేడియో వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 10 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.