పెసరపప్పు టేస్టీగా వండాలా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

Updated on: Oct 21, 2026 | 4:37 PM

పప్పుల్లో చాలా మందికి పెసరపప్పు కర్రీ అంటే ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని ఎక్కువగా వండుకుంటారు. అంతే కాకుండా ఇది చాలా త్వరగా వండుకోవచ్చును. అయితే చాలా మంది పూరీలోకి అయినా అన్నంలోకి అయినా సరే పప్పు కర్రీ చాలా టేస్టీగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఇలా వండితే చాలు ఎలా తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది.

1 / 5
పప్పు కర్రీ టేస్టీగా వండటానికి కావాల్సిన పదార్థాలు : పెసరపప్పు, జీలకర్ర, వెల్లుల్లి , ఆవాలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు, పోపు గింజలు. వీటితో చాలా సులభంగా రుచికరమైన పప్పు కర్రీని వండుకోవచ్చును.

2 / 5
పప్పు కర్రీ వండటానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ముందుగా పెసరపప్పు తీసుకోవాలి. దానిని శుభ్రం చేసుకొని దానిని కుక్కర్‌లోకి తీసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి.

3 / 5
పప్పు దాదాపు 2 విజిల్స్ వచ్చిందంటే చాలు పూర్తిగా ఉడికిపోతుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ నుంచి ఆవిరి మొత్తం పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు దువ్వతో దానిని మెత్తగా కలుపుకోవాలి. పప్పు చాలా మెత్తగా అయిన తర్వాత కొన్ని వాటర్ పోసి దానిని మరోసారి మంచిగా కలుపుకోవాలి.

4 / 5
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి అందులో సరిపడ నూనె వేయాలి. తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు అందులో వేయాలి. తర్వాత సరిపడ ఉప్పు వేసుకోవాలి.

5 / 5
పప్పును మరో ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడికే సమయంలో కొంచెం కొత్తిమీర, మరికొంచెం  కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. దీని వలన టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలా పప్పు కర్రీని మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పెసరపప్పు రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us