
ప్రకృతి దేవుడు మనకు ప్రసాదించిన గొప్ప వరం. ఇందులో పనికిరానిది అంటూ ఏదీ ఉండదు. అయితే, ఎన్నో రకాల మొక్కలలో దాగి ఉన్న ఔషధ గుణాలు మనకు తెలియక వాటిని కలుపు మొక్కలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటాం. అటువంటి మొక్కలలో తలంబ్రాల చెట్టు కూడా ఒకటి. లక్షలు ఖర్చు పెట్టినా నయంకాని రోగాలను సైతం నయం చేసే అద్భుత ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి.

ఈ మొక్కను ప్రాంతాన్ని బట్టి సీతమ్మవారి తలంబ్రాల చెట్టు, అత్తాకోడళ్ల చెట్టు, లాంటానా, పులికంప, లంబాడీ చెట్టు, గాజు కంప వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది సాధారణంగా చెరువు గట్లు, కాలువల పక్కన, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. తలంబ్రాల మొక్క వర్బనేసి కుటుంబానికి చెందినది. ఇందులో దాదాపు 150 జాతులు ఉన్నాయి. మన పెద్దల నమ్మకం ప్రకారం, ఈ మొక్కకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, అందుకే దీని ఆకులను మంత్ర తంత్రాలలో ఉపయోగిస్తారు. పేరుకు తలంబ్రాల చెట్టు అయినప్పటికీ, ఇది నిజానికి ఒక పొద. ఆఫ్రికా, అమెరికా ఖండాలలో ఎక్కువగా కనిపించే ఈ మొక్కను హిమాచల్ ప్రదేశ్‌లో ఫర్నిచర్ తయారీకి, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తమిళనాడులో నతములు బుట్టలు అల్లడానికి వినియోగిస్తారు.

తలంబ్రాల చెట్టు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది చర్మ సమస్యల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ఆకుల్లో క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గాయాలను త్వరగా మాన్పడానికి సహాయపడతాయి. పొలాల్లో పనిచేసేటప్పుడు గాయాలు తగిలితే, వెంటనే ఈ ఆకులను నలిపి కట్టు కట్టడాన్ని మనం సినిమాల్లో కూడా చూసి ఉంటాం. చర్మ ఫంగస్ వంటి వ్యాధులను తగ్గించడానికి కూడా ఇది శక్తివంతమైన ఆయుర్వేద మొక్కగా ఉపయోగపడుతుంది.

మారిపోయిన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే వచ్చే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, రుమాటిజం, కండరాల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి తలంబ్రాల ఆకులను ఆముదంలో కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న ప్రదేశాల్లో పూతగా అప్లై చేసి కట్టాలి. ఇలా నాలుగు రోజులు చేస్తే నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఇంట్లో దోమల బెడదను తగ్గించడానికి కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఆకుల్లో మిథనాలిక్, ఇథనాలిక్ సమ్మేళనాలు ఉండటం వల్ల దోమలు, కీటకాలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. తలంబ్రాల చెట్టు ఆకులను బాగా ఎండబెట్టి, వాటిని ఇంట్లో పొగలాగా వేసుకుంటే దోమలు వెంటనే పారిపోతాయి. అంతేకాకుండా, దగ్గు, గొంతు నొప్పి నివారణకు ఈ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది. పాముకాటుకు గురైన వారికి, ఏదైనా పురుగు కుట్టినప్పుడు దీని ఆకులను నలిపి లేదా నూరి కట్టు కడితే శరీరంలోని విషం బయటకు వచ్చేస్తుందని చెబుతారు. కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపునొప్పి, విరోచనాలు వంటి వ్యాధులను నివారించడంలో, ఆకలి పెంచడంలో, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో, పంటి నొప్పికి గొప్ప మెడిసిన్‌గా కూడా ఇది పనిచేస్తుంది.