Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం.. వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..!

Edited By:

Updated on: Sep 26, 2026 | 6:11 PM

వార ఫలాలు (సెప్టెంబర్ 27–అక్టోబర్ 3, 2026): ఈ వారం మేష రాశి వారికి అనుకూల ఫలితాలు లభించడంతో పాటు మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. మిథున రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభించి, ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని పొందే అవకాశం ఉంది. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే పూర్తి వారఫలాలు చూడండి.

1 / 13
వార ఫలాలు (సెప్టెంబర్ 27-అక్టోబర్ 3, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమ ఫలితాలతో గడుస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

2 / 13
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల సుఖ సంతోషాలు, మనశ్శాంతికి లోటుండదు. వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యో గంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించడం జరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగ పరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులు మంచి  ఫలితాలు సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా గడుస్తాయి.

3 / 13
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడి షష్ట స్థితి, తృతీయ స్థానంలో కుజుడి నీచ స్థితి వల్ల వారమంతా మిశ్రమ ఫలితాలతో గడుస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసలతో గానీ పనులు, వ్యవహారాలు పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ఫలితాలుంటాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సమీప బంధువుల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకర వార్త వినాల్సి వస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. కొందరు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి.

4 / 13
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు చతుర్థ స్థానంలోనూ, గురువు ధన స్థానంలోనూ ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనుల్ని, ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని తేలికగా చక్కబెడతారు. ఇతరులకు సాయం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మ కాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కార మవుతుంది. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

5 / 13
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ రాహువు ప్రభావం వల్ల మధ్య మధ్య మాన సిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. ఏదీ సాఫీగా జరగదు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, వ్యవహారాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి శుభవార్త అందుతుంది. నిరుద్యో గుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులను తగ్గించుకో వడం మంచిది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులకు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

6 / 13
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి ధన స్థానంలో ధనాధిపతి బుధుడితో యుతి చెందడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయ త్నాలన్నీ ఫలిస్తాయి. సంపదలు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతాయి. జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలో చనలను ప్రవేశపెడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. రోజువారీ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్ట వలసి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడా నికి కూడా అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

7 / 13
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశినాథుడు బుధుడు ధన స్థానంలో ప్రవేశించి, ధన, భాగ్యాధిపతి శుక్రుడితో యుతి చెందడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము వసూలు కావడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగు తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరి గినా ప్రతిఫలం ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఆశిం చిన స్థాయిలో రాణిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.  ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా,సంతృప్తికరంగా సాగిపోతాయి.

8 / 13
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో భాగ్యాధిపతి బుధుడు కలవడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు.

9 / 13
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో గురువుతో కలవడం, లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యో గంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి కలిగే అవకాశం ఉంది.ఆర్థిక పరి స్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహా రాల్లో మిత్రుల సహాయ సహకారాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీదా, కుటుంబ విష యాల మీదా శ్రద్ధ పెట్టడం అవసరం. అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

10 / 13
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి బుధుడు దశమ కేంద్రంలో, గురువు లాభ స్థానంలో ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, ఆదాయపరంగా కూడా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాలలో మీ నిర్ణయాలు, ఆలోచనలు, వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగానే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్ష లలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో మారడానికి చేస్తున్న ఫలితాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

11 / 13
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): సప్తమ, భాగ్య, దశమ స్థానాలు శుభ గ్రహాలతో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగులో ఉన్న ముఖ్య మైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిక రంగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలను వసూలు చేస్తారు. అద నపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెడతారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

12 / 13
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గురు, శని, కుజ, రవి గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల వారమంతా మిశ్రమ ఫలితాలు అనుభ వానికి వస్తాయి. ముఖ్యంగా ఏలిన్నాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా బాధ్య తల ఒత్తిడి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకుని ఇబ్బంది పడతారు. స్వల్ప అనా రోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికా రులను ఆకట్టుకుంటారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. చిన్న నాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.  విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. రావల సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

13 / 13
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం వల్ల అన్ని రంగాలవారికి, అన్ని విషయాల్లోనూ సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త నిర్ణయాలను ఆచ రణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి ప్రశంసలందు కుంటారు. వ్యాపారాల్లో లాభాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు  విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us