
సింహ రాశిలోకి చంద్రుడు సంచారం చేయనున్నాడు. ఇప్పటికే, కేతువు, గురు గ్రహాలు కూడా సింహ రాశిలో సంచారం చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రుడు కూడా అదే రాశిలోకి వెల్లడంతో మూడు గ్రహాల కలియక జరగనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఏ రాశి వారికి ఇది కలిసి వస్తుందో చూద్దాం.

మిథున రాశి : మిథున రాశి వారికి ఈ కాలం బాగా కలిసి వస్తుంది. మీ మూడో స్థానంలో ఈ యోగం ఏర్పడుతుండటంతో ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. అన్నదమ్ములతో సత్సంబంధాలు బలపడతాయి. చిన్న ప్రయాణం కూడా పెద్ద లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

సింహ రాశి :ఈ యోగం మీ రాశిలోనే ఏర్పడుతుండటంతో మీకే అత్యధిక లాభం. మీ లగ్నంలో చంద్ర, గురు, కేతువుల కలయిక వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా గతంలో కంటే బలంగా ఉంటారు. కొత్త ఇల్లు, వాహనం కొనే ఆలోచనలు నిజమవుతాయి. పెళ్లి కాని వారికి శుభవార్త వినిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృశ్చిక రాశి :వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అద్భతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి పదో స్థానంలో ఏర్పడుతున్న ఈ రాజయోగం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటాయి. వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్టులు వస్తాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. నిరుద్యోగులకు కలలు కన్న ఉద్యోగం వచ్చే సమయం ఇదే. అంతే కాకుండా వీరు ఊహించని విధంగ ఆదాయం పెరుగుతుంది

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ధనయోగం పడుతోంది. ఈ మూడు గ్రహాల దృష్టి మీ ధన స్థానం మీద ఉండటం వల్ల ఆదాయం అనేక మార్గాల్లో వస్తుంది. పాత అప్పులు తీరిపోతాయి. పొదుపు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో చిన్నపాటి శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.