
ధన త్రయోదశి రోజు శుక్ర సంచారం, బుధ సంచారం జరిగింది. దీని వలన పన్నెండు రాశులలో నాలుగు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం వలన వారికి సంపదకు లోటు లేకుండా ఉండటమే కాకుండా, నేటి నుంచి నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభ రాశి :ఈ రాశి వారికి ఇది బంగారు కాలం. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద లాభం వస్తుంది. కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది

మకర రాశి : శుక్ర, బుధ సంచారం వలన మకర రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంగారం, ఆస్తి కొనే యోగం ఉంది. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు లాభిస్తాయి

తుల రాశి : తుల రాశి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, విదేశీ ఆఫర్లు వస్తాయి. వ్యాపారులకు రెట్టింపు లాభాలు వస్తాయి. లాటరీ, షేర్ మార్కెట్ లో కూడా లాభం కనిపిస్తోంది. కళారంగంలో ఉన్నవారు అవార్డులు అందుకునే ఛాన్స్ ఉంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ రాజయోగం అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత ఉంటుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి.