
ఉదయం లేచి ఇంటి ముందు నీళ్లను చల్లడం మత విశ్వాసాలలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నదంట. ముఖ్యంగా గడపపై నీళ్లు పోయడం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందంట. ప్రతి రోజూ ఉదయం గడప ముందు నీళ్లు పోయడం వలన అది ప్రతి కూల శక్తులను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇంటిలో సానుకూల వాతావరణం ఏర్పడేలా చేస్తుందంట. అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది.

ముఖ్యంగా ఉదయం పూట ఇంటి గుమ్మ ముందు నీళ్లు పోయడం వలన ఇంటిలోనికి ప్రతి కూల శక్తి ప్రవేశించదు. ఇది కుటుంబానికి సానుకూల శక్తిని ఇస్తుంది. అంతే కాకుండా బయటి క్షుద్ర శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఇది నిరోధిస్తుందంట. అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.

అలాగే గడప ఇంటి లోపల ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది అని చెబుతుంటారు. అందువలన ప్రతి రోజూ ఉదయం ఇంటిని, గడపను శుభ్రం చేయడం వలన చేతబడి, చెడు దృష్టి, ఇతర ప్రతికూల శక్తులు ఇంటిలోకి రాకుండా ఉంటాయి. అందుకే చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు శుభ్రంగా నీటిని చల్లి ముగ్గులు వేస్తారు. కడపను కూడా శుభ్ర పరిచి పసుపు కుంకుమతో పూజిస్తారు.

మత విశ్వాసం ప్రకారం, శుభ్రంగా, చక్కగా ఉన్న గడప లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఉదయాన్నే గడపపై నీళ్ళు పోయడం లేదా నీళ్ళు చల్లడం ద్వారా దానిని శుభ్రం చేస్తే, అమ్మవారు ఇంటికి వస్తారని అంటారు. అలా చేయడం వల్ల ఇంట్లోకి సంతోషం, శ్రేయస్సు వస్తాయని, అలాగే మెరుగైన ఆర్థిక సౌభాగ్యానికి మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయం గడపను అందంగా అలంకరిస్తారు.

అంతే కాకుండా ఏ ఇంటిలో అయితే ఉదయం ఇంటి ముందు నీటిని చల్లి, ముగ్గులతో అందంగా అలంకరిస్తారో, ఆ ఇంటిలో ఆనందం నెలకుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.