దీపావళి రాశిఫలాలు.. కష్టాలు ఎదుర్కునే రాశులివే!

Updated on: Nov 08, 2026 | 1:20 PM

నవంబర్ నెల చాలా ప్రత్యేకమైన నెల. ఈ మాసంలో దీపావళి పండుగ, కార్తీక పౌర్ణమి మాత్రమే కాకుండా చాలా గ్రహాలు సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా గ్రహాల కలయికల వలన రాజయోగాలు ఏర్పడనున్నాయి. బుధాదిత్య రాజయోగం, శుక్రాధిత్య రాజయోగం , త్రిగ్రాహి రాజయోగం. ఇలా అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి.

1 / 5
అయితే కొన్ని గ్రహాల సంచారం, కలయికల వలన నాలుగు రాశుల  వారు దీపావళి పండుగ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. కాగా ఈ దీపావళి పండుగ నుంచి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

2 / 5
తుల రాశి : తుల రాశి వారు ఈ దీపావళి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు, సూర్యుడి కలయిక వలన ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. చేతికి డబ్బు వచ్చినా నిలవకుండా ఖర్చైపోతుంది. కుటుంబంలో చిన్న చిన్న మాటలకే గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి.

3 / 5
కన్యా రాశి :కన్యా రాశి వారికి ఈ దీపావళి తర్వాత కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. బుధుడి సంచారం వలన పనిలో ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో మనసు చికాకుగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాములతో లెక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వవద్దు, తిరిగి రావడం కష్టం అవుతుంది.

4 / 5
మకర రాశి :మకర రాశి వారు దీపావళి నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలి. శని ప్రభావం వలన ఉద్యోగంలో బదిలీలు, పనిభారం పెరిగే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు, నష్టం వచ్చే అవకాశం ఉంది. స్నేహితులు అనుకున్న వారే మోసం చేసే ప్రమాదం ఉంది కాబట్టి, ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

5 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ దీపావళి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. రాహు, కేతువుల ప్రభావం వలన మానసిక ఒత్తిడి, అనవసర ఆలోచనలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు రాకపోవడంతో నిరాశ కలుగుతుంది. వ్యాపారంలో కొత్త వారితో ఒప్పందాలు చేసుకునేటప్పుడు పేపర్లు జాగ్రత్తగా చదవండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

Loading...
Unable to load recommendations.
Follow Us