
హిందూ సంప్రదాయం ప్రకారం ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. 2026లో దీపావళి ఆది వారం రోజు వచ్చింది. అయితే సూర్య భగవానుడికి చెందిన రోజున దీపావళి అమావాస్య, పండుగ రానుండటంతో నాలుగు రాశులపై లక్ష్మీదేవి, సూర్యుడి చల్లని చూపు ఉండ నుంది. దీని వలన వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.

సింహ రాశి : సింహ రాశి వారికి ఈ దీపావళి నిజమైన వెలుగు తీసుకొస్తుంది. రాశ్యాధిపతి సూర్యుడు తన సొంత రోజైన ఆదివారం నాడు బలంగా ఉండటంతో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి ఇది అద్భుతమైన సమయం కానుంది.

మేష రాశి :మేష రాశి వారికి ఈ దీపావళి అమావాస్య చాలా శుభప్రదం. కుజుడు అనుకూలంగా ఉండటంతో మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే ఆలోచనలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు, జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది.

తుల రాశి :తుల రాశి వారికి ఈ దీపావళి అదృష్టాన్ని తెస్తుంది. శుక్రుడి అనుగ్రహంతో మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోయి లాభాలు మొదలవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, బదిలీ కోరుకున్న వారికి శుభవార్త అందుతుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ దీపావళి నుంచి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. బుధుడి బలం వలన మీ తెలివితేటలు, మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. చదువులో, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చినా, అవి మీకు మంచి పేరు తెస్తాయి.