ఆడవారి పనిని చిటికెలో సులువు చేసే అద్భుతమైన కిచెన్, హోమ్ టిప్స్

Updated on: Nov 28, 2026 | 5:14 PM

రోజూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటి పనులు, వంట పనులతో గృహిణులకు అస్సలు తీరిక ఉండదు. కానీ చిన్నచిన్న తెలివైన చిట్కాలు పాటిస్తే, సమయం ఆదా అవ్వడమే కాకుండా ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, సువాసనతో కళకళలాడుతూ ఉంటుంది. మన రోజువారీ పనులను సులువు చేసే కొన్ని అద్భుతమైన కిచెన్ మరియు హోమ్ టిప్స్ ఇప్పుడు చూద్దాం.

1 / 5
ముందుగా వంటింటి సరుకుల నిల్వ విషయానికి వస్తే, బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక చిన్న గుడ్డలో పసుపు, కొన్ని మిరియాలు వేసి మూట కట్టి బియ్యం డబ్బాలో ఉంచాలి. అలాగే కందిపప్పు, పసుపు డబ్బాల్లో ఎండుమిరపకాయలు లేదా వాటి గింజలు వేస్తే పురుగులు దరిచేరవు.

2 / 5
జీడిపప్పులో కొన్ని మిరియాలు, పంచదార డబ్బాలో నాలుగు లవంగాలు వేసి ఉంచితే చీమలు, పురుగుల బెడద అసలు ఉండదు. పెరుగు త్వరగా పులిసిపోకుండా ఉండాలంటే అందులో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను వేయాలి. కూరగాయల విషయంలో పచ్చిమిరపకాయల తొడిమెలు తీసి, ఉప్పు నీటిలో అరగంట నానబెట్టి, ఆ తర్వాత పొడి వస్త్రంపై పూర్తిగా ఆరబెట్టి కవర్లో నిల్వ చేస్తే రెండు మూడు నెలల పాటు తాజాగా ఉంటాయి; పైగా వాటిపై ఉండే రసాయనాలు కూడా తొలగిపోతాయి.

3 / 5
బంగాళాదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే వాటితో పాటు వెల్లుల్లిపాయలను కలిపి గాలి తగిలే చోట ఉంచాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా, వాసన రాకుండా ఉండాలంటే రుబ్బిన తర్వాత ఒక చెంచా వంట నూనె కలిపి భద్రపరచుకోవాలి. గట్టిపడిన నిమ్మకాయల నుంచి రసం బాగా రావాలంటే వాటిని ఐదు నిమిషాలు వేడి నీటిలో వేసి తీయాలి.

4 / 5
ఇంటి శుభ్రత మరియు అలంకరణలో కూడా కొన్ని సులువైన పద్ధతులు ఉన్నాయి. నల్లబడిన వెండి గ్లాసులు, విగ్రహాలను సాధారణ టూత్‌పేస్ట్‌తో రుద్ది కడిగి, పొడి గుడ్డతో తుడిస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి. దేవుడి గదిలో దీపం వెలిగించే ముందు ఒత్తికి కొద్దిగా జవాదు రాస్తే, దీపం వెలిగినంత సేపు ఇల్లంతా ఆధ్యాత్మిక సువాసనతో నిండిపోతుంది. వాడిన అగ్గిపుల్లలు కింద పడి గలీజు అవ్వకుండా, కొత్త అగ్గిపెట్టెకు ఒక ఖాళీ అగ్గిపెట్టెను అంటించి అందులో వాడిన పుల్లలు వేసుకోవచ్చు.

5 / 5
కొత్త చీపురు కొన్నప్పుడు దుమ్ము రాలకుండా కవర్‌లో ఉండగానే బాగా నలిపి, కొబ్బరి నూనె రాసి దువ్వెనతో దువ్వితే ఎక్కువ కాలం మన్నుతుంది. అలాగే ప్రయాణాల్లో వాటర్ బాటిల్‌కు తడిపిన సాక్స్ తొడిగితే నీళ్లు చాలాసేపు చల్లగా ఉంటాయి. గడ్డకట్టిన కాఫీ పొడిని పడేయకుండా పెరుగులో కలిపి ముఖానికి, మెడకు రాసుకుంటే ట్యాన్ తొలగి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే మీ ఇంటి పని ఎంతో సులువుగా మారుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us