
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు నవంబర్ 25న కుంభ రాశిని వదిలి పెట్టి మకర రాశిలోకి సంచారం చేయనుంది. అలాగే అదే సమయంలో కేతువు కూడా సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది.ప దీని వలన జూన్ 2028 వరకు నాలుగు రాశుల వారికి ప్రయోజనాలు చేకూ0రనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.

కుంభ రాశి : కుంభ రాశి వారికి రాహు సంచారం వలన కలిసి వస్తుంది. రాహువు మీ రాశి నుండి బయటకు వెళ్తున్నాడు. గత 18 నెలలుగా ఉన్న మానసిక ఒత్తిడి, అనవసర ఆలోచనలు తగ్గుతాయి. నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. విదేశీ అవకాశాలు, టెక్నాలజీ రంగం వారికి మంచి లాభం. ఖర్చులు అదుపులోకి వస్తాయి.

కన్యా రాశి : కేతువు లాభ స్థానం నుండి పదవ స్థానానికి సంబంధించిన ఫలితం ఇవ్వడం వల్ల ఉద్యోగంలో ఊహించని ప్రమోషన్. పోటీ పరీక్షలు రాసే వారికి ఇది గోల్డెన్ టైం. అప్పుల నుండి బయటపడతారు. తల్లి వైపు నుండి ఆస్తి లాభం సూచన. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది

మకర రాశి : మీ రాశిలోకి రాహువు వస్తున్నా, ఇది మీకు లగ్నంలో బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. రాజకీయం, రియల్ ఎస్టేట్, పరిశ్రమ రంగాల వారికి కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం. మాట తీరుపై మాత్రం జాగ్రత్త అవసరం.

తుల రాశి : మీకు రాహువు పంచమ స్థానంలోకి రావడం వల్ల సంతానం విషయంలో శుభవార్త, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కాకుండా దీర్ఘకాల పెట్టుబడుల్లో లాభం. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకు వెళ్లే అవకాశం. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది