ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే రోటి, చపాతీల్లోకి సూపర్ కాంబో

Updated on: Jun 09, 2026 | 12:37 PM

పచ్చి శనగపప్పు, టమాటాలు రెండు మన ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకంటే దీనిలో ప్రోటీన్లు, ఇంకా ఫైబర్‌ కూడా నిండి ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో నే చేసుకుని తినొచ్చు. దీనిని చపాతీ రోటీ, చపాతీ, పూరీల్లోకి కూడా తింటారు ఎందుకంటే ఇది అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి.

1 / 5

పచ్చి శనగపప్పు టమాటా కూరకు కావలసిన పదార్థాలు:  ఒక కప్పు పచ్చి శనగపప్పు , రెండు టమాటాలు,  ఒక పెద్ద ఉల్లిపాయ, 
నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  అర టేబుల్ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం, 
 ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ,  ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా,  రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్  స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

పచ్చి శనగపప్పు టమాటా కూరకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి శనగపప్పు , రెండు టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

2 / 5
పచ్చి శనగపప్పు టమాటా కూర తయారి విధానం : ముందుగా పచ్చి శనగపప్పును తీసుకుని కనీసం 8 గంటలు పాటు వీటిని బాగా నానాబెట్టుకోవాలి. ఇంకా దీనిని కుక్కర్‌లో కాకుండా ఒక పాత్రలో ఉడికించుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి బాగా వేడయ్యాక  రెండు ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి  కూడా వేసి గోల్డ్ కలర్లోకి  మారే వరకు దీనిని బాగా  వేయించాలి.

3 / 5
ఆ తరవాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా  వేసి పచ్చివాసన పోయే వరకు దీనిని మిక్స్ అయ్యే వరకు  కలపాలి. ఇంకా దీనిలో నాలుగు టమాటా ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు కూడా  వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఇంకా దీనిలో కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా  వేసి బాగా కలపాలి.

4 / 5
ఇక చివర్లో దీనిలో ఉడికించిన శనగపప్పు కూడా వేసి దానిలో కొద్దిగా  నీరు కూడా కనీసం 10 నిమిషాల పాటు దీనిని బాగా  మగ్గించాలి. ఇక చివరగా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర కూడా చల్లి మరో రెండు నిమిషాలు పాటు  ఉడికించి స్టవ్ మీదే ఉంచాలి. అంతే వేడి వేడి పచ్చి శనగపప్పు టమాటా కూర రెడీ.  రోటి, చపాతీల్లోకి అదిరిపోయే కాంబినేషన్.

5 / 5

Follow Us