
పాలతో ఫేస్ వాష్: పాలలో ఫేష్ వాష్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేసిన చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని సాఫ్ట్‌గా మారుస్తుంది. ఇందుకోసం ఒక దూది ఉండను పచ్చి పాలలో నానబెట్టి. దానితో ఫేస్ పై రుద్దుకోండి. కొద్దిసేపటి తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోండి. పాలు రాసుకున్న తర్వాత మీకు మంట, దురద లేదా ఎరుపు వంటివి కనిపిస్తే, దాని వాడకాన్ని ఆపివేయండి.

టమాటాతో ఫేస్ ప్యాక్: టమోటాలలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే విటమిన్లు, పోషకాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఫేస్‌కు వాడడం మంచిది. ఇందుకోసం మీరు టమోటాను సగానికి కోసి.. దాన్ని మీ ముఖానికి సున్నితంగా రాయండి. సుమారు 5-10 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని నీటితో కడుక్కోండి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం వల్ల మీ ముఖ్యం మృదువుగా మారడంతో పాటు నిగారింపు పెరుగుతుంది. మీది సున్నితమైన చర్మం అయితే, టమోటాను నేరుగా రాసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.

తేనెతో ఫేస్ వాష్: తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడానికి సహాయపడుతాయి.ఇవి చర్మాన్ని పొడిబారకుండా శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం 1/2 టీస్పూన్ పచ్చి తేనె తీసుకొని దానితో చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోండి. ఇలా చేసిన తర్వాత టవాల్‌తో ముఖాన్ని రుద్దకుండా మెల్లగా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఆలూ జ్యూస్: బంగాళాదుంపలలో విటమిన్ సి తో సహా అనేక పోషకాలు ఉంటాయి. మొటిమలు, నిర్జీవమైన చర్మానికి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక బంగాళాదుంప నుండి రసం తీసి ఒక గిన్నెలో ఉంచండి. దానిని దూది సహాయంతో ముఖం, మెడపై అప్లై చేసుకోండి. సుమారు 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోండి.

గమనిక: అయితే ఇవి సహజ పదార్థాలే అయినప్పటికీ అందరికి ఒకేలాంటి ప్రయోజనాలను అందించలేవు. కాబట్టి మీ ముఖానికి ఏదైనా రాసే ముందు ఎల్లప్పుడూ ప్యాచ్ టెస్ట్ చేయండి. మీకు మంట, దురద లేదా ఎరుపుదనం వంటివి అనిపిస్తే, వెంటనే మీ ముఖాన్ని కడుక్కోండి. మీకు మొటిమలు ఎక్కవగా ఉంటే చర్మవ్యాధి నిపుణులను సంప్రదిచండి!