మిగిలిపోయిన అన్నంతో కరకరలాడే కమ్మనైన దోశలు

Updated on: Nov 24, 2026 | 7:04 PM

మన ఇంట్లో ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా మెత్తగా ఉడికిపోవడం, లేదంటే ఎక్కువ అన్నం వండేయడం.. ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు అన్నాన్ని పడేయకుండా, పప్పు నానబెట్టే పని, పులియబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మిగిలిపోయిన అన్నంతో మంచి దోశలు వేసుకోవచ్చు.

1 / 5

2 / 5

కావాల్సిన పదార్థాలు: అన్నం ఒక కప్పు, బియ్యప్పిండి అర కప్పు, పెరుగు ఒక కప్పు, జీలకర్ర ఒక స్పూన్, పచ్చిమిర్చి నాలుగు, చిన్న అల్లం ముక్క, ఉప్పు ఒక స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కరకరలాడే ఈ దోశలను ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

3 / 5

అన్నం దోశలు తయారీ విధానం:ముందుగా మిక్సీ జార్‌లో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుని, బియ్యప్పిండి అర కప్పు, పెరుగు ఒక కప్పు, జీలకర్ర ఒక స్పూన్, నాలుగు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
అన్నం దోశలు తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టి బాగా వేడయ్యిన తర్వాత దోశ పిండిని గరిటెతో వేసి రౌండ్‌గా బాగా పరచాలి. కొంచెం కాలిన తర్వాత అంచుల వెంట నూనె వేయాలి.

5 / 5
అన్నం దోశలు తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు మీరు దీనిని  ఒకవైపు బాగా క్రిస్పీగా, దోరగా అయిన తర్వాత రెండో  వైపు కూడా తిప్పి ఎర్రగా కాల్చుకుని ఆ తర్వాత  తీస్తే ఎంతో ఇవి  కరకరలాడే క్రిస్పీ దోశలు రెడీ అయిపోతాయి. అంతే, వేడి వేడి దోశలు రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us