వారెవ్వా.. సండే రోజు తప్పక చేసుకోవాల్సిందే.. కారం కారంగా చికెన్ మిక్చర్
సండే వచ్చిందంటే చాలు, ప్రతి ఇంటిలో నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇక చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ కర్రీ వంటుకుంటారు. ఇంకొంత మంది మటన్ , ఎగ్ వండుకుంటారు. ఎప్పుడూ తినేలా రోటీన్‌గా తింటే సండే స్పెషల్ ఏముంటుంది. కాగా, ఇప్పుడు మనం ఆదివారం రోజు తప్పకుండా చేసుకోవాల్సిన ఓ స్పెషల్ రిసిపీ గురించి తెలుసుకుందాం. అది ఏమిటి అంటే?
చాలా మంది చికెన్‌తో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా చికెన్ మిక్చర్ ట్రై చేశారా? కాస్త కారం కారంగా చికెన్ మిక్చర్ చేస్తే నోరూరిపోవడమే కాకుండా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. కాగా, ఇప్పుడు మనం చికెన్ మిక్చర్ టేస్టీ గా ఎలా చేయాలో చూసేద్దాం.
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా చికెన్ తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో చికెన్ వేసి , చిటికెడు పసుపు, కాస్త కారం, కొంచెం ఉప్పు వేసి చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ నుంచి రెండు లేదా మూడు విజల్స్ వచ్చిన తర్వాత చికెన్ పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్చర్ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో వేయించడానికి సరిపడ నూనె పోసుకోవాలి. తర్వాత అందులో నూనె వేసుకోవాలి.క అందులో వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, పుట్నాలు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి.ఇప్పుడు మనం ముందగా ఉడికించుకొని దంచుకోవాలి. దంచుకున్న చికెన్ ముక్కలను కూడా నూనెలో వేసి మంచిగా వేయించుకోవాలి.
అలాగే తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. వీటిని ముందుగానే ఉప్పు, చక్కెర వేసి నానబెట్టుకోవాలి. వాటిని ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ మిక్చర్ రెడీ. ఇక సండే రోజు ఇది చేసి పెడితే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.