
కన్యా రాశి : ఈ నెల మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు వస్తుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పెద్దల ఆశీర్వాదంతో కొత్త ఆస్తులు కొనే యోగం ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. మీరు అనుకున్న పనిని ధైర్యంగా మొదలుపెడితే విజయం మీదే.

కుంభ రాశి : మీకు గురువు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు చకచకా జరిగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి శుభవార్త వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త లాభాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి చేతిలో డబ్బు నిలుస్తుంది.

మకర రాశి : మీకు ఈ నెల గురు బలం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. వ్యాపారంలో కొత్త డీల్స్ కుదురుతాయి, లాభాలు పెరుగుతాయి. పాత అప్పులు తీర్చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశం వస్తుంది. ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయి.

తుల రాశి : గురువు చూపు మీ మీద పడటంతో మీ జాతకమే మారిపోతుంది. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత పెరుగుతుంది. పెళ్లి కావాల్సిన వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీ మాటకు ఇంట్లో, బయట గౌరవం పెరుగుతుంది.

Guru Graham 1