గోంగూర చికెన్ పచ్చడి.. ఇలా చేస్తే రుచి జన్మలో మరవరు

Updated on: Oct 21, 2026 | 5:15 PM

నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చికెన్ పచ్చడి అందరికీ తెలుసు కానీ గోంగూర చికెన్ పచ్చడి తెలుసా? పర్ఫెక్ట్ కొలతలతో గోంగూర చికెన్ పచ్చడి రెడీ చేసి పెడితే ప్రతి ఒక్కరూ వదలకుండా తింటారు. కాగా దానిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. చికెన్  కిలో,  ఎర్ర గోంగూర మూడు కట్టలు, చింత పండు నిమ్మకాయ సైజు అంత,  పసుపు టీస్పూన్,   ఉప్పురుచికి సరిపడా,   కారం 5 టేబుల్ స్పూన్లు,   అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా కోసం :  ధనియాలు: 1/2 టేబుల్ స్పూన్,   జీలకర్ర, మెంతులు,   లవంగాలు,   చెక్క.

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా గోంగూరను తీసుకొని ఆకులను తుంచి శుభ్రంగా కడిగి, ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. తర్వాత నిమ్మకాయ సైజు చింత పండు తీసుకొని గోరు వెచ్చటి నీటిలో దానిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిపై పాన్ పెట్టాలి. అందులో మసాలా కోసం తీసుకున్నవి వేసి మంచిగే వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత అందులో గోంగూర ఆకులు వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో చింత పండు రసం వేసుకోవాలి. గోంగూర ఆకు మంచిగా వేగి, రసం పట్టి, నూనె పైకి  తేలే వరకు మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత  దానిని వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో నూనె పోసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో బోన్లెస్ చికెన్‌ను వేయాలి. బోన్స్‌తో కూడా చేసుకోవచ్చు.

4 / 5
అది నూనెలో వేగుతున్న సమయంలో దీంట్లోనే 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు వేసి హై ఫ్లేమ్‌లో వేయించాలి.  చికెన్‌లో నుండి నీళ్లు ఊరి, ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి, నూనె పైకి తేలి, చికెన్ ముక్క లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఇలా హై ఫ్లేమ్‌లో వేయించడం వల్ల ముక్క గట్టి పడకుండా మెత్తగా, పైన క్రిస్పీగా ఉంటుంది. చికెన్ వేగిన తర్వాత, 2 టీస్పూన్ల తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, లో ఫ్లేమ్‌లో పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కన పెట్టుకోవాలి.

5 / 5
తర్వాత చల్లారిన చికెన్‌లో ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి ,  5 టేబుల్ స్పూన్ల పచ్చి కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపాలి.  ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్‌ను వేసి మొత్తం బాగా కలిసేలా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్, గోంగూర పచ్చడి రెడీ. దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులు అయినా సరే నిల్వ చేసుకోవచ్చును.

Loading...
Unable to load recommendations.
Follow Us