Hair Fall: మగవారిలో బట్టతల త్వరగా రావడానికి ఇదే అసలు కారణం! తేల్చేసిన నిపుణులు

|

Aug 20, 2024 | 12:50 PM

తలపై చేయి వేస్తే చాలు.. కొందరికి వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా రాలిపోతుంటుంది. పరిస్థితి ఇలాగే ఉంటే క్రమంగా బట్టతల రావడం ఖాయం. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు నూనె, షాంపూ, కండీషనర్ ఎన్ని వాడినా ప్రయోజనం ఉండటంలేదా? హెర్బల్ కాస్మోటిక్స్ ఉపయోగించినా లాభంలేదా?

1 / 5

2 / 5
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలిపోయే సమస్య తగ్గకపోతే జీవనశైలిలోనే ఆ సమస్య దాగి ఉందని అర్థం చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన నిత్య జీవితంలో తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు జుట్టు రాలడాన్ని మరింత పెంచుతున్నాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కింది జాగ్రత్తలు తప్పక పాటించాలి.

3 / 5
తగినంత నీరు త్రాగాలి. శరీరంలో నీటి లోపం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాల పనితీరులో ఆటంకం ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ వల్ల జుట్టు కూడా పొడిబారుతుంది. శరీరంలో నీటి లోపం వల్ల కూడా జుట్టు రాలిపోయే సమస్య కూడా పెరుగుతుంది. చాలా మంది బరువు తగ్గడానికి డైట్‌ ఫాలో అవుతుంటారు. ఫలితంగా శరీరంలో విటమిన్ సి, డి, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపిస్తే జుట్టుకు కావాల్సిన పోషకాలు అందవు. ఫలితంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

4 / 5
రోజూ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుందని కొందరు అనుకుంటారు. కానీ షాంపూ చేయకపోతే తలపై చెమట, ధూళి పేరుకుపోతాయి. ఫలితంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అందుకే జుట్టును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి. జుట్టుకు అధిక వేడి కలిగినా జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుంది. కాబట్టి జుట్టుకు కర్లర్లు, స్ట్రెయిట్‌నర్లు, డ్రైయర్‌లు ఉపయోగించే ముందు ఓసారి ఆలోచించడం మంచిది.

5 / 5
ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల వల్ల జుట్టు రాలిపోతుంది. బట్టతల నుంచి ఉపశమనం పొందాలంటే ముందు ఈ రెండు అలవాట్లను వదిలివేయాలి.