Amazing Facts: పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు..

Updated on: Mar 15, 2026 | 9:45 PM

పాములంటే భయపడని వారుండరు. పామును అల్లంత దూరంలో చూస్తేనే చాలా మంది వణికిపోతారు. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. ఏ పాము విషపూరితమో.. ఏది కాదో చూడగానే చెప్పలేం. కాబట్టి పాములతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విషపూరిత పాము కాటేస్తే కొన్ని క్షణాల్లో చనిపోయే ప్రమాదం ఉంది..

1 / 5
పాములంటే భయపడని వారుండరు. పామును అల్లంత దూరంలో చూస్తేనే చాలా మంది వణికిపోతారు. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. ఏ పాము విషపూరితమో.. ఏది కాదో చూడగానే చెప్పలేం. కాబట్టి పాములతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విషపూరిత పాము కాటేస్తే కొన్ని క్షణాల్లో చనిపోయే ప్రమాదం ఉంది.

2 / 5
పాము తన ఆహారాన్ని ఎంత దూరం నుండి చూడగలదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి పాములు చాలా తక్కువ కంటి చూపును కలిగి ఉంటాయి. అవి 1 నుండి 3 మీటర్ల (3 నుండి 10 అడుగులు) దూరం వరకు మాత్రమే వాటి కళ్ళతో స్పష్టంగా చూడగలవు.

3 / 5
పాములు కంటి చూపు సరిగా లేకపోవడంతో అవి వేటను గుర్తించడానికి తమ నాలుకలను ఉపయోగిస్తాయి. అందుకే ఇవి పదే పదే తమ నాలుకలను బయటకు చాపి గాలిలో ఎర వాసనను గుర్తిస్తాయి. అచితూ కింగ్ కోబ్రా వంటి కొన్ని పెద్ద పాములు సాధారణ పాముల కంటే కొంచెం ఎక్కువ దూరం చూడగలవు. ఇవి సాధారణంగా 10 నుంచి 15 మీటర్ల వరకు చూడగలవు.

4 / 5
పాములకు బాహ్య చెవులు లేనప్పటికీ అవి భూమిలో స్వల్ప కంపనాలను గుర్తించగలవు. తద్వారా జంతువులు, మనుషులు దగ్గరకు వచ్చినప్పుడు అవి వెంటనే గ్రహించగలవు. పాములకు వేడిని గ్రహించే సెన్సార్లు కూడా ఉంటాయి.

5 / 5
కొండచిలువలు, పిట్ వైపర్లు వంటి కొన్ని పాములు వాటి తలలపై ప్రత్యేక సెన్సార్లను కలిగి ఉంటాయి. ఇది చీకటిలో కూడా తమ ఆహారం నుంచి వెలువడే వేడిని గుర్తించి దానిపై దాడి చేయడానికి వీలు కల్పిస్తుంది. దీని అర్థం పాములు వేటాడేందుకు చూపుపై ఆధారపడవు. బదులుగా ఎరను గుర్తించడానికి వాటి వాసన, కంపనం, వేడి వంటి ఇంద్రియాలను ఉపయోగిస్తాయి.

Follow Us