
దానిమ్మ గింజల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎలా ఉంటాయి. ఈ పండు తొక్కలో కూడా గింజల కంటే రెండు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు, పోషక గుణాలు ఉంటాయట. దానిమ్మ తొక్కలో కాల్షియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచడానికి, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

జీర్ణ సమస్యలకు చెక్: దానిమ్మ తొక్కలో టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల్లోని వాపు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. అతిసారం, జిగట విరేచనాలు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది దివ్వ ఔషదంలా పనిచేస్తుంది. ఇందుకోం దానిమ్మ తొక్కను ఎండబెట్టి నీటిలో వేసి మరిగించి తాగాలి.. ఇలా తాగడం వల్ల కడుపులోని అసౌకర్యం, అజీర్తి దూరమవుతాయి.

గుండె ఆరోగ్యం: దానిమ్మ తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెందకుండా ఆపుతాయి. ఇది రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడటంతో పాటు రక్తపోటును కూడా కంట్రోల్లో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజూ దానిమ్మ తొక్కతో చేసిన టీ తాగడం ఉత్తమం.

చర్మ సౌందర్యం: చర్మ సౌందర్య సంరక్షణలో దానిమ్మ తొక్క చాలా బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలు, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. అంతేకాదు మొటిమలు, బ్లాక్‌హెడ్స్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం దానిమ్మ తొక్కను ఎండబెట్టి దాన్ని పొడిగా చేసి.. ఆ పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ లేదా పెరుగులో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మానికి తక్షణ కాంతి లభిస్తుంది.

రోగనిరోధక శక్తి: దానిమ్మ తొక్కలో విటమిన్ సి, విటమిన్ ఈ లతో పాటు పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల బలాన్ని పెంచి, ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.( Note పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు మాత్రమే అందించబడింది. వీటిని ఉపయోగించే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి)