ఆరోగ్యానికి వరం.. జామకాయ పచ్చడి.. ఎలా పెట్టాలంటే?

Updated on: Oct 17, 2026 | 7:32 AM

జామకాయలు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఇష్టంగా తింటారు. అయితే చాలా వరకు జామకాయలను నార్మల్‌గా తింటుంటారు. కానీ వీటితో పచ్చడి చేసి తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుందంట. కాగా, ఇప్పుడు మనం జామకాయల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

1 / 5
జామకాయలు చాలా వరకు తక్కువ ధరకు లభిస్తాయి. అంతే కాకుండా పల్లె టూర్లలో విరివిగా దొరుకుతాయి. వీటితో పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వలన ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట.  దీనిని ఇలా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వారంలో కనీసం ఒక్కసారి తిన్నా కూడా దీని ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

2 / 5
 జామకాయ పచ్చడి కోసం కావాల్సిన పదార్థాల్లోకి  వెళ్లితే.. గట్టి కాస్త దోరగా ఉండే జామకాయలు, పండ్లు అయితే పచ్చడి పాడవుతుంది. ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, ఇంగువ, పసుపు, కారం పొడి, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, ఆవ నూనె లేదా మీకు లభించేది ఏదైనా పర్వాలేదు.

3 / 5
తయారీలో వెళ్లితే.. జామకాయ పచ్చడి కోసం ముందుగా జామకాయలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటికి ఎలాంటి తడి లేకుండా ఉండటానికి దాదాపు 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టడం మంచిది.

4 / 5
తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి.  అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు గింజలు, అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత వాటిని చల్లారబెట్టి, మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేసి , పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న జామకాయ ముక్కలను అందులో వేయాలి. తర్వాత మసాలా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి.

5 / 5
అది అంతా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత అందులోనే నిమ్మరసం వేయాలి. తర్వాత ప్రతి ముక్కకు మసాలా, నిమ్మరసం పట్టేలా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ జామకాయ పచ్చడి రెడీ. చిన్న పిల్లలే కాకుండా, పెద్ద వారు కూడా ఇష్టంగా ఈ పచ్చడి తింటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us