
గ్యాస్ సమస్యలు తగ్గాలంటే, ప్రేగుల్లో మలం నిల్వ ఉండకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం. "అవుట్పుట్ బాగుంటేనే ఇన్పుట్ బాగుంటుంది" .ప్రేగుల్లో మలం నిలవ ఉంటే ఆహార పదార్థాలు సరిగ్గా అరగవు, దీనివల్ల గ్యాస్ ఎక్కువ తయారవుతుంది. దీనిని నివారించడానికి, ఉదయం లేవగానే లీటరుంపావు గోరువెచ్చని నీళ్లను తాగాలి. ఒకేసారి తాగలేకపోతే, నాలుగైదు నిమిషాల వ్యవధిలోనైనా తాగాలి. నీళ్లు తాగిన తర్వాత మనసును పొట్ట, ప్రేగులపై కేంద్రీకరించి మలం కదలికలను గమనించాలి. ఇలా చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయి సుఖ విరోచనం అవుతుంది. మొదటిసారి మోషన్ అయిన రెండు గంటల తర్వాత, ఏమీ తినకుండా మళ్లీ లీటర్ నీళ్లను తాగాలి. రెండోసారి మోషన్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇది ప్రేగులను పూర్తిగా ఖాళీ చేసి, రోజంతా కంఫర్ట్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారాన్ని అరిగించడానికి అత్యవసరం. భోజనం మధ్యలో నీళ్లు తాగితే ఈ జీర్ణ రసాలు పలచబడతాయి. యాసిడ్ ఘాటు (pH 0.8-1.2) తగ్గితే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఆహారం పులిసిపోయి, గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది. దీనిని నివారించడానికి, తినేటప్పుడు అసలు నీళ్లు తాగకూడదు.

రోజుకు మూడుసార్లు మాత్రమే ఆహారం తీసుకోవడం గ్యాస్ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మాత్రమే తినాలి. "ఒకసారి మనం ఉదయం తిన్నాక ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వకుండా మధ్యలో ఏదైనా ఆడించామనుకోండి, సగం ఉడికిన వాటిలో ఇంకోటి వేస్తే ఎట్లా ఉంటుందో అలా అయిపోతుంది మన పొట్టలో" అలా అవుతుందని అంటున్నారు. ఆహారం సరిగ్గా అరగకపోవడం వల్ల ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. భోజనాల మధ్య గణనీయమైన గ్యాప్ ఇవ్వడం వల్ల జీర్ణవ్యవస్థ ఒకసారి తిన్న ఆహారాన్ని పూర్తిస్థాయిలో అరిగించుకోవడానికి సమయం ఉంటుంది.

తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు, త్రేన్పులతో అసౌకర్యానికి గురయ్యేవారు వారం.. పది రోజుల పాటు ఒక ప్రత్యేక ఆహార నియమాన్ని పాటించవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోనూ, సాయంత్రం డిన్నర్ లోనూ పండ్లను మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం మాత్రం సాధారణ భోజనం చేయవచ్చు. ఆపిల్, అరటిపండు, సపోటా, కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ వంటి ఆరు రకాల తీయటి పండ్లలో రెండూ, మూడు రకాలు ఉదయం, రెండూ, మూడు రకాలు సాయంత్రం తినవచ్చు.

రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల లోపు తినాలి. ఖాళీ కడుపులో గ్యాస్ ఎక్కువ అవుతుంది అని చాలామంది అపోహ పడతారు, కానీ ఆ విశ్రాంతి ప్రేగులు ఆరోగ్యంగా మారడానికి, రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది. " మీరు పడుకుంటే ఆ తరవాత రోజు ఉల్లాసంగా పని చేయగలుగుతారు. మీరు నైట్ మేలుకుంటే నిద్రపోకుండా ఆ తర్వాత రోజ నీరసం అయిపోతారు" అన్నట్లుగా, ప్రేగులకు కూడా తగిన విశ్రాంతి అవసరం. రాత్రిపూట విశ్రాంతి లభించడం వల్ల మరుసటి రోజు పగటిపూట జీర్ణక్రియ మరింత శక్తివంతంగా, వేగవంతంగా జరుగుతుంది. రాత్రి ఆలస్యంగా తినడం, పదింటికి పైగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ అవుతాయి.