Droupadi Murmu: సంప్రదాయ సంతాలీ చీరలో ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం.. ఇంతకీ ఈ శారీ స్పెషల్ ఏంటంటే?

|

Jul 25, 2022 | 3:52 PM

Droupadi Murmu: భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు.

1 / 5
 భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము సంప్రదాయ సంతాలీ చీర ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

2 / 5
ఆకుపచ్చ ఎరుపు రంగు కాంబినేషన్ల ఉన్న అంచులతో తెల్లటి రంగులో ఉన్న ఈ చీర చూడ్డానికి ఎంతో సింపుల్‌గా అందంగా ఉంది. ఈ చీరను మొత్తం చేతితోనే తయారుచేస్తారు. ఇందులో ఎలాంటి యంత్రాలను ఉపయోగించరు.

3 / 5
 నేత కార్మికులు చక్కటి రంగు దారాలతో ఈ చీరను తయారు చేస్తారు. ఈ చీర పూర్తి సాంప్రదాయ శైలిలో ఉన్నా ట్రెండింగ్ లుక్‌ను ఇస్తుంది. ఒకప్పుడు గిరిజన మహిళలు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఈ చీరలు ధరించేవారట.

4 / 5
గతంలో  స్త్రీల స్వాతంత్ర్యానికి, సాధికారతకు చిహ్నంగా ఈ చీరలపై ప్రత్యేకంగా మూడు విల్లులను డిజైన్లు చేసేవారట. అయితే కాలక్రమేణా ఆ డిజైన్ల స్థానంలో మార్పులు వచ్చాయి. నేటి నాగరికత, సాంప్రదాయలకు తగ్గట్టుగా ఈ చీరలను తీర్చిదిద్దుతున్నారు.

5 / 5
కాగా తూర్పు భారతదేశంలోని సంతాల కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. జార్ఖండ్‌తో పాటు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఈ చీరకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఎలాంటి యంత్రాల సహాయం లేకుండా కేవలం చేతితో తయారు చేయడం వల్ల ఈ చీర ఖరీదు కూడా కాస్త ఎక్కువే.