
పోషకాల గని: డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) కేవలం చూడటానికే కాదు, ఆరోగ్యపరంగానూ ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి బరువు అదుపులో ఉంటుంది.

రోగనిరోధక శక్తి, క్యాన్సర్ నివారణ: ఇందులో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) గణనీయంగా పెంచుతాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఎముకలను బలంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది తోడ్పడుతుంది.

జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ: ఈ పండులో పీచు పదార్థం (ఫైబర్), నీటి శాతం చాలా ఎక్కువ. ఇది మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణ వ్యవస్థను చురుకుగా ఉంచుతుంది. అలాగే, ఇది తిన్న తర్వాత ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గాలనుకునే వారికి ఒక వరంలా పనిచేస్తుంది.

మధుమేహ నింత్రణ: డ్రాగన్ ఫ్రూట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిస్ రోగులకు ఇది ఎంతో ప్రయోజనకరం. నిపుణుల సలహా మేరకు హ్యీపీగా తినొచ్చు.

గుండె ఆరోగ్యం: ఈ పండు గింజల్లో ఉండే ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని మెగ్నీషియం రక్త ప్రసరణను బాగుచేసి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.

రక్తహీనత దూరం, మెరిసే చర్మం: ఇందులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత (Anemia) సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా, దీని గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ముడతలు, మొటిమలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. శారీరక నిస్సత్తువతో బాధపడేవారు కొన్ని డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు తింటే తక్షణ శక్తి లభిస్తుంది.