పెనానికి అంటుకోకుండా, విరిగిపోకుండా క్రిస్పీగా రావాలంటే ఈ చిన్న టిప్స్ చాలు

Updated on: Oct 16, 2026 | 6:50 PM

ఆంధ్రుల సంప్రదాయ అల్పాహారాల్లో 'పెసరట్టు' అత్యంత ప్రజాదరణ పొందిన బలవర్ధకమైన వంటకం. పెసలలో ఉండే అధిక ప్రొటీన్ వల్ల ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని ఇస్తుంది. అయితే చాలామంది ఇంట్లో పెసరట్టు చేసేటప్పుడు పెనానికి అతుక్కుపోవడం లేదా పెసరట్టు గట్టిగా రావడం జరుగుతుంది. దీనికి కేవలం పెసలు మాత్రమే కాకుండా కొన్ని నిర్దిష్టమైన దినుసులను సరైన నిష్పత్తిలో కలపడం చాలా ముఖ్యం. 

1 / 5
కావలసిన పదార్థాలు: పచ్చ పెసలు 1 కప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం, పావు టీస్పూన్ మెంతులు, 5 నుండి 6 ఎండు మిరపకాయలు, చిన్న ముక్క అల్లం, 1 చిన్న ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. పెసరట్టు టాపింగ్ కోసం: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, జీలకర్ర

2 / 5
ఇన్‌స్టంట్ అల్లం చట్నీ కోసం: 20 గ్రాములు అల్లం తరుగు, 10 నుండి 12 ఎండు మిరపకాయలు , 3 మీడియం సైజు ముక్కలుగా తరిగిన టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర పావు టీస్పూన్ మెంతులు , 1 రెమ్మ కరివేపాకు, తగినంత ఉప్పు, తాలింపు దినుసులు & ఇంగువ

3 / 5
తయారీ విధానం: ఒక బౌల్‌లో పెసలు, మినప్పప్పు, శనగపప్పు, బియ్యం, మెంతులు వేసి శుభ్రంగా కడగాలి. రాత్రంతా లేదా కనీసం 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన పప్పులను మిక్సీ జార్‌లో తీసుకుని.. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, అల్లం ముక్క, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మరీ పల్చగా కాకుండా దోశల పిండిలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి పులియాల్సిన అవసరం లేదు, వెంటనే వేసుకోవచ్చు.

4 / 5
ఇన్‌స్టంట్ అల్లం చట్నీ తయారీ: పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు, కరివేపాకు, 10-12 ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉప్పు వేసి టమాటాలు మెత్తబడే వరకు మగ్గించాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి కలిపి చల్లారనివ్వాలి. మిక్సీ జార్‌లో ఈ మిశ్రమం, 2 స్పూన్ల బెల్లం వేసి కొద్దిగా నీళ్లతో స్మూత్‌గా రుబ్బి.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువతో తాలింపు వేసి కలుపుకోవాలి.

5 / 5
దోశ పెనాన్ని బాగా వేడిచేసి, మంటను లో ఫ్లేమ్‌కి తగ్గించాలి. పెనం విపరీతమైన వేడితో ఉంటే పిండి అతుక్కుపోయి సాగదు. ఇప్పుడు గరిటెడు పిండిని వేసి పలుచగా స్ప్రెడ్ చేయాలి. పైనుంచి సన్నటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, చిటికెడు జీలకర్ర చల్లి స్పూన్‌తో తేలికగా నొక్కాలి. చుట్టూ కొద్దిగా నూనె వేసి మీడియం ఫ్లేమ్‌పై ఎర్రగా కాలే వరకు ఉంచితే అంచులు వాటంతట అవే లేచి వస్తాయి. అంతే, క్రిస్పీగా ఉండే నోరూరించే 'పెసరట్టు' సిద్ధం! ఘాటైన తీపి-పులుపు కలగలిసిన ఇన్‌స్టంట్ అల్లం చట్నీతో వేడివేడిగా తింటుంటే హోటల్ రుచి కంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us