Team India: ధోని, కోహ్లీలు ఒంట్లో పూనారా ఏంది.. క్లాస్ ఫినిషింగ్‌తో మెంటలెక్కిస్తున్నావ్ గా..

Updated on: Feb 10, 2026 | 9:24 PM

T20I World Cup: టీ20 ప్రపంచ కప్‌లో అమెరికాపై సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 84 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. అతని ప్రశాంతత, మ్యాచ్ ముగించే తీరు ఎంఎస్ ధోనిని గుర్తుచేస్తున్నాయని అమెరికా స్పిన్నర్ హర్మీత్ సింగ్ ప్రశంసించాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ నిర్మించడం విరాట్ కోహ్లీని తలపించిందని పేర్కొన్నాడు.

1 / 5
Suryakumar Yadav: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అమెరికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ఇన్నింగ్స్ తో జట్టును గట్టెక్కించిన సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత అగ్రశ్రేణి బ్యాటర్లు విఫలమై పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ తన బాధ్యతాయుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మైదానం నలుమూలలా షాట్లు కొట్టే తన సహజ సిద్ధమైన శైలిని పక్కన పెట్టి, జట్టు అవసరాలకు తగ్గట్టుగా సంయమనంతో ఆడిన సూర్య కేవలం 49 బంతుల్లోనే 84 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు 29 పరుగుల చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

2 / 5
ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్ పై అమెరికా స్పిన్నర్, భారత సంతతి ఆటగాడు హర్మీత్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. సూర్యకుమార్ ను భారత క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలతో పోల్చడం విశేషం. ఒత్తిడి సమయాల్లో సూర్య ప్రదర్శిస్తున్న ప్రశాంతత, మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లి ముగించే తీరు తనకు ఎంఎస్ ధోని స్థితప్రజ్ఞతను గుర్తుచేస్తోందని హర్మీత్ వ్యాఖ్యానించాడు. తన కెరీర్ ముగింపు దశలో ధోని ఏ విధంగానైతే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ లను ఫినిష్ చేసేవారో, ఇప్పుడు సూర్యకుమార్ లో కూడా అదే పరిణితి కనిపిస్తోందని హర్మీత్ కొనియాడాడు.

3 / 5
అంతేకాకుండా, సూర్యకుమార్ ను సాధారణంగా విధ్వంసకర స్ట్రోక్ ప్లేయర్ గానే చూస్తామని, కానీ ఈ మ్యాచ్ లో అతను ఒక పక్కా ఫినిషర్ గా మారి పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు విరాట్ కోహ్లీని తలపించిందని హర్మీత్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లలో ఉండే గేమ్ అవేర్నెస్, బాధ్యతను మోసే గుణం ఇప్పుడు సూర్యకుమార్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఇది అనుభవంతో వచ్చిన గొప్ప మార్పు అని ఆయన విశ్లేషించారు.

4 / 5
ఈ మ్యాచ్ లో స్వయంగా నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి రాణించిన హర్మీత్ సింగ్, భారత్ లో ప్రపంచ కప్ ఆడటం తనకు అత్యంత భావోద్వేగపూరితమైన విషయం అని చెప్పుకొచ్చాడు.

5 / 5
వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఆటగాళ్లతో కూడిన అమెరికా జట్టు సమిష్టిగా పోరాడిందని, అయితే సూర్యకుమార్ అసామాన్య ఇన్నింగ్స్ తమను ఓటమి అంచుకు నెట్టిందని హర్మీత్ అంగీకరించాడు. మొత్తానికి, కెప్టెన్సీ బాధ్యతలతో సూర్యకుమార్ తన ఆట తీరును మార్చుకుని ధోనీ లాంటి ఫినిషింగ్, కోహ్లీ లాంటి నిలకడను పునికి పుచ్చుకోవడం భారత క్రికెట్ కు శుభపరిణామం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.