Cardamom: ఈ చిన్న యాలకులతో గుట్టలాంటి పొట్టను కరిగించేయవచ్చు..

|

Jan 12, 2025 | 2:48 PM

మనకు ఎంతో సులభంగా లభించే వాటిల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తాం. యాలకులతో వంటలకు మంచి రుచి కూడా వస్తుంది. యాలకులతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఇవే యాలకులతో ఎంత గుట్టలాంటి పొట్టనైనా ఈజీగా తగ్గించుకోవచ్చు..

1 / 5
యాలకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్వీట్స్ తయారీలో, మసాలా వంటల తయారీలో ఖచ్చితంగా యాలకులు ఉండాల్సిందే. ఇవి చూసేందుకు చిన్న కనిపించినా.. ఎన్నో ప్రమాదకర వ్యాధుల్ని రానివ్వకుండా చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

2 / 5
ఎన్నో ఆయుర్వేద మందుల్లో కూడా ఈ యాలకులను ఉపయోగిస్తూ ఉంటారు. యాలకులతో అధిక బరువు, ఊబకాయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ప్రస్తుత  రోజుల్లో కూర్చుని పని చేయడం వల్ల అందరికీ పొట్టలు వచ్చేస్తున్నాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.

3 / 5
ఈ పొట్టను కరిగించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. కానీ సింపుల్‌గా ఎక్సర్‌ సైజులు చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు ఫాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది.

ఈ పొట్టను కరిగించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. కానీ సింపుల్‌గా ఎక్సర్‌ సైజులు చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు ఫాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది.

4 / 5
బరువు తగ్గాలి అనుకునేవారు, సన్ననైన నాజూకు నడుము కావాలి అనుకునేవారు.. ప్రతిరోజూ రాత్రి గోరు వెచ్చని నీటిలో 4 లేదా 5 యాలకులను వేసి నానబెట్టండి. ఉదయాన్నే ఈ నీటిని తాగండి. ఇలా ప్రతి రోజూ చేయండి. కొద్ది రోజుల్లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

5 / 5
ఈ డ్రింక్ తాగితే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థలో ఎలాంటి మలినాలు లేకుండా బయటకు పోతాయి. కొవ్వు కూడా కరుగుతుంది. మల బద్ధకం సమస్య కూడా ఉండదు. దీంతో మీ పొట్ట సన్నబడుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఈ డ్రింక్ తాగితే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థలో ఎలాంటి మలినాలు లేకుండా బయటకు పోతాయి. కొవ్వు కూడా కరుగుతుంది. మల బద్ధకం సమస్య కూడా ఉండదు. దీంతో మీ పొట్ట సన్నబడుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)