Samantha: ముంబై వీధుల్లో సమంత హల్ చల్.. ఏమైంది??
ఎప్పుడూ లేటెస్ట్ మోడల్ కారుల్లో ట్రావెల్ చేస్తే ఏం బావుంటుంది. అప్పుడప్పుడూ కామన్ మేన్‌లా థింక్ చేయాలి. కామన్ మేన్ లాగా ట్రావెల్ చేయాలి. అప్పుడే కదా సరదా.. ఇంతకీ మీరేమంటారూ.. అంతేనా.. సామ్ మాత్రం అంతే అంతే అంతే... అని చాలా స్ట్రాంగ్‌గా చెప్పేస్తున్నారు.
Updated on: Feb 13, 2025 | 9:49 PM

ఎప్పుడూ లేటెస్ట్ మోడల్ కారుల్లో ట్రావెల్ చేస్తే ఏం బావుంటుంది. అప్పుడప్పుడూ కామన్ మేన్‌లా థింక్ చేయాలి. కామన్ మేన్ లాగా ట్రావెల్ చేయాలి. అప్పుడే కదా సరదా.. ఇంతకీ మీరేమంటారూ.. అంతేనా.. సామ్ మాత్రం అంతే అంతే అంతే... అని చాలా స్ట్రాంగ్‌గా చెప్పేస్తున్నారు.

ముంబై వీధుల్లో తిరుగుతున్నారు సామ్. అది కూడా హాయిగా ఆటోలో. మాస్క్ పెట్టుకుని ట్రావెల్ చేస్తున్నా సామ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది కదా సింప్లిసిటీ అంటే అని కొందరు పొగుడుతుంటే, మరికొందరు మాత్రం.. మీలో ఉన్న పసి మనసు మాకు అర్థమవుతోందని చెబుతున్నారు. ఆటోలో వెళ్తూ.. వెళ్తూ.. రకుల్ ప్రీత్‌సింగ్ మూవీని ప్రమోట్ చేసేశారు సామ్.

మేరే హజ్బెండ్ కీ బీవీ అంటూ రకుల్ నటించిన మూవీ ఈ నెల్లోనే రిలీజ్‌కి ఉంది. ఈ సినిమాలోని పాటను, రకుల్‌ని తన పోస్టులో ట్యాగ్ చేశారు సామ్. సామ్ జోష్‌ని చూస్తే, ఇప్పుడప్పుడే హైదరాబాద్ వైపు చూడరేమో అనిపిస్తోంది.

ఆల్రెడీ ఫ్యామిలీమేన్3ని కంప్లీట్ చేసేశారు ఈ లేడీ. ప్రస్తుతం ఆదిత్యరాయ్ కపూర్‌తో రక్త్ బ్రహ్మాండ్‌లో నటిస్తున్నారు. ఫ్యామిలీమేన్2 లో సామ్ యాక్షన్ చూసిన వారు, ఒన్ మోర్ టైమ్ విట్‌నెస్ చేయడానికి మేం రెడీ అంటున్నారు. అన్నట్టు సిటాడెల్ నెక్స్ట్ పార్టును సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి.