ఆ హీరోలు రాత్రిళ్లు ఇంటికొచ్చి తలుపు కొట్టేవారు.. ఒక అతను చచ్చిపోతా అన్నాడు

Updated on: May 16, 2026 | 4:27 PM

ఎన్నో సినిమాల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు జయలలిత. ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా గడిపిన ఆమె ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.. సీనియర్ నటి జయలలిత తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, చేదు అనుభవాలను గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన రీతిలో వెల్లడించారు.

1 / 5
ఎన్నో సినిమాల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు జయలలిత. ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా గడిపిన ఆమె ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.. సీనియర్ నటి జయలలిత తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, చేదు అనుభవాలను గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన రీతిలో వెల్లడించారు. కొంతమంది నటీమణులు హీరోయిన్స్‌గా కెరీర్‌ను ఆరంభించినా, సక్సెస్ కాలేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడతారని, అలాంటి వారిలో తానూ ఒకరిని ఆమె పేర్కొన్నారు.

2 / 5
తొలుత హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆ తర్వాత ఆఫర్‌లు లేకపోవడంతో బోల్డ్ క్యారెక్టర్లు చేయవలసి వచ్చిందని, దానివల్ల తన వ్యక్తిగత జీవితంలో కూడా రాజీ పడాల్సి వచ్చిందని ఆమె ఓపెన్‌గా చెప్పేశారు. ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించి, తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె స్పష్టంగా మాట్లాడారు. అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్ ఎదురైనా, ప్రశ్నించకుండా కెరీర్‌లో సాగాలని తాను భావించానని చెప్పారు. సినిమా రంగంలో ఆడవారి దయనీయ పరిస్థితులను వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 / 5
హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినా అనుకున్నంత సక్సెస్ రాలేదని, ఆ తర్వాత ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్లే వచ్చాయని, దాంతో ప్రేక్షకులు తనను అదే రకం పాత్రలో చూసి ఫిక్స్ చేసుకున్నారని జయలలిత తెలిపారు. తాను చేసే పాత్రలు బోల్డ్ గా ఉన్నా, అంతర్గతంగా తాను కూడా ఒక స్త్రీనేనని, తనకు భావాలు, గౌరవం ఉన్నాయని ఆమె అన్నారు. ఆ కాలంలో పరిస్థితులు అలా ఉండేవని, అవకాశాల కోసం కష్టపడినా కొందరు వ్యక్తులు అమ్మాయిలను వాడుకునే ప్రయత్నం చేసేవారని ఆమె వివరించారు.

4 / 5
సినిమా ఇండస్ట్రీ మొత్తం మగవారి ఆధిపత్యంలోనే నడుస్తుందని, ఆడవాళ్లు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమని జయలలిత అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు పేరున్న పెద్ద నటులు రాత్రివేళల్లో తన ఇంటికి వచ్చి తలుపులు కొట్టేవారని, ఒకసారి ఒక పెద్ద ఆర్టిస్ట్ తలుపు తెరుస్తావా లేక ఇక్కడే ఉరివేసుకుని చనిపోతావా అంటూ బెదిరించాడని ఆమె గుర్తు చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో తాను ఏమీ చేయలేకపోయానని, భయంతో కన్నా ఎలా తప్పించుకోవాలో ఆలోచించేదాన్నని చెప్పారు. తనను తాను కాపాడుకోలేకపోయానని అంగీకరించిన ఆమె, పరిస్థితులు అలా ఉన్నందున అందరితో ఫ్రెండ్లీగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు.

5 / 5
కొన్ని సందర్భాల్లో తప్పించుకోగలిగినా, అన్నిసార్లు సాధ్యం కాలేదని, అలాంటి సమయంలో తప్పక రాజీ పడాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. ఇది సిగ్గు కాదని, వాస్తవమని ఆమె వ్యాఖ్యానించారు. ఒక దర్శకుడు తన ప్రతిపాదనను తిరస్కరించినందుకు తనను సినిమా నుండి తీసేశాడని, ఆ సమయంలో బాధగా అనిపించినా పోరాడితే మరిన్ని తలుపులు మూసుకుపోతాయని మౌనంగా ఉండిపోయానని జయలలిత వెల్లడించారు. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్ళినప్పుడు కొందరు నటులు అర్ధరాత్రి తన గది తలుపులు కొట్టి బెదిరించేవారని, అయితే తాను తలుపులు తీసేదాన్ని కాదని, మరుసటి రోజు ఫోన్ చూసుకోలేదని, నిద్రలో ఉన్నానని సర్దేసేదాన్నని ఆమె తెలిపారు. ప్రతి సందర్భం తన చేతుల్లో ఉండదని, కొన్నిసార్లు తప్పించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బంధం, ప్రేమ, వ్యామోహం ఏవీ లేవని, తాను వయసులో ఉన్నప్పుడు మంచి పర్సనాలిటీతో రాంప్ క్యారెక్టర్లు చేసేదాన్నని, పర్సనల్‌గా కూడా అదే క్యారెక్టర్ అయి ఉండవచ్చని చాలామంది అపోహ పడ్డారని ఆమె అన్నారు. 

Follow Us