
అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రకారును మాయ చేసిన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఈ అమ్మడు అసలు పేరు కంటే ప్రీతిగానే చాలా మందికి పరిచయం. ఎందుకంటే అంతలా ఈ అమ్మడు అర్జున్ రెడ్డి మూవీలో ఒదిగిపోయింది.

ఇక ఈ మూవీ తర్వాత ఈ చిన్నదానికి అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. అవకాశాలు వచ్చినప్పటికీ మూవీస్ అంతగా హిట్ అందుకోకపోవడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ కెరీర్ డౌన్ ఫాలో అయ్యింది.

తెలుగులో అవకాశాలు తగ్గడంతో షాలిని పాండే బాలీవుడ్ పై కన్నేసి అక్కడ వరస సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. కానీ ఈ బ్యూటీకి అక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు వెబ్ సిరిస్ లలో నటిస్తుంది ఈ బ్యూటీ.

షాలిని పాండే సినిమాల్లో ప్రస్తుతం ఎక్కువ కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన వరస ఫొటో షూట్ తో యూత్ ను తన వైపుకు లాక్కుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ తన పింక్ డ్రెస్ లో తన గ్లామర్ తో మత్తెక్కించింది. స్టన్నింగ్ లుక్స్ తో తన వయ్యారాలను ఒలుకబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది . ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.