Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..

Updated on: May 15, 2026 | 1:27 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ అమ్మాయి సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరిస్తూ ఇప్పటికీ అగ్ర కథానాయికగా చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.

1 / 5
 హీరోయిన్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒకప్పుడు రవితేజ తనకు అత్యంత సన్నిహితుడని, బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల తరచుగా మాట్లాడుకోవడం లేదా కలుసుకోవడం కుదరడం లేదని నయనతార వివరించారు. అయితే, ప్రస్తుతానికి కాస్త దూరం వచ్చినా, ఇప్పటికీ తమ స్నేహబంధం అలాగే ఉందని ఆమె స్పష్టం చేశారు.

2 / 5
నయనతార, రవితేజ మధ్య ఒక ప్రత్యేకమైన మాట్లాడుకునే విధానం ఉందని ఆమె తెలిపారు. వారు సాధారణంగా హిందీలో మాట్లాడుకునేవారని చెప్పారు. రవితేజ అమితాబ్ బచ్చన్ కి పెద్ద అభిమాని అని, ఆయన హిందీని చాలా చక్కగా మాట్లాడతారని నయనతార వెల్లడించారు. మొదట్లో సెట్‌లో పనిచేసేటప్పుడు వారిద్దరూ హిందీలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారని, అది ఒక అలవాటుగా మారిందని, ఆ సంభాషణల వల్ల వారి మధ్య బంధం మరింత బలపడిందని ఆమె వివరించారు. రవితేజతో కలిసి అనేక చిత్రాలలో నటించిన అనుభవం తనకు ఉందని నయనతార గుర్తు చేసుకున్నారు.

3 / 5
తన కెరీర్‌లో చాలా మంది హీరోలతో, దర్శకులతో కలిసి పనిచేయడం వల్ల వారందరినీ ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తానని నయనతార అన్నారు. ఏ ఒక్కరితో పనిచేసినా అది కేవలం పనిలా అనిపించదని, తన సహనటులు, దర్శకులు, చిత్ర బృందం అంతా తన కుటుంబంలో ఒక భాగమని ఆమె పేర్కొన్నారు. రవితేజతో తన అనుబంధం కూడా అలాంటిదేనని, కుటుంబ బంధం వలె పటిష్టమైనదని నయనతార తెలిపారు.  అలాగే న్టీఆర్‌తో కలిసి పనిచేసినప్పటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆయన అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్ , సెట్స్‌లో ఆయన చేసే అల్లరి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు

4 / 5
నయనతార మాట్లాడుతూ, పరిశ్రమలో చాలా మంది హీరోలు తాము రిహార్సల్స్ చేయమని చెబుతుంటారని, కానీ నిజానికి అందరూ ప్రాక్టీస్ చేస్తారని అన్నారు. అయితే, తన కెరీర్‌లో అస్సలు రిహార్సల్స్ చేయకుండా నేరుగా సెట్‌లోకి వచ్చి సింగిల్ టేక్‌లో డ్యాన్స్ చేసే ఏకైక హీరోని తాను చూశానని, ఆయనే జూనియర్ ఎన్టీఆర్ అని అన్నారు. మాస్టర్ కంపోజ్ చేసిన కష్టమైన స్టెప్పులను, ఫ్లోర్ మూమెంట్లను కూడా తారక్ కేవలం ఒక్కసారి చూసి, అంతకంటే అద్భుతంగా కెమెరా ముందు చేసి చూపిస్తారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

5 / 5
షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఎంతో అల్లరిగా, చురుగ్గా ఉంటారని నయనతార గుర్తుచేసుకున్నారు. ఒకరోజు షూటింగ్ సెట్‌లో తాను టచ్-అప్ చేసుకుంటుండగా, ఎన్టీఆర్ తనవైపే చూస్తూ.. "ఎందుకు అంతలా టచ్-అప్ చేసుకుంటున్నావు? ఎలాగూ స్క్రీన్ మీద నిన్ను ఎవరూ చూడరు, అంతా నన్నే చూస్తారు" అంటూ ఎంతో సరదాగా కామెంట్ చేశారని నవ్వుతూ చెప్పారు. ఎన్టీఆర్ ఎంతో స్వీట్ అండ్ క్యూట్ పర్సన్ అని ఆమె అన్నారు. నయనతార చేసిన ఈ వ్యాఖ్యలు సాషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us