AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth : ఎనిమిదేళ్లు అతన్ని పిచ్చిగా ప్రేమించా.. చివరకు మోసం చేశాడు : జబర్దస్త్ తన్మయి

తెలుగు టెలివిజన్‌లో కామెడీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన షోల్లో జబర్దస్త్ ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు, నటులు వెలుగులోకి వచ్చారు. కొందరు సినిమాల్లో నటులుగా, మరికొందరు దర్శకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జబర్దస్త్‌లో లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులను నవ్వించిన పలువురు ఆర్టిస్టుల్లో తన్మయి కూడా ఒకరు.

Rajeev Rayala
|

Updated on: Sep 30, 2026 | 1:38 PM

Share
తెలుగు టెలివిజన్‌లో కామెడీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన షోల్లో జబర్దస్త్ ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు, నటులు వెలుగులోకి వచ్చారు. కొందరు సినిమాల్లో నటులుగా, మరికొందరు దర్శకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జబర్దస్త్‌లో లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులను నవ్వించిన పలువురు ఆర్టిస్టుల్లో తన్మయి కూడా ఒకరు. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ఆమె ప్రేక్షకులకు చేరువయ్యారు. జబర్దస్త్‌తో పాటు ఇతర టీవీ కార్యక్రమాలు, ఈవెంట్లలోనూ కనిపిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తన్మయి.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

1 / 5
తెరపై నవ్వులు పంచే తన వెనుక ఎన్నో కన్నీళ్లు, కష్టాలు, ఒంటరి పోరాటం ఉంది. చిన్నతనం నుంచే తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొందని తన్మయి వెల్లడించారు. చదువుపై ఆసక్తి ఉన్న తనకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేదని తెలిపారు. బైపీసీ చదివి వైద్య రంగంలోకి వెళ్లాలని అనుకున్నప్పటికీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదని చెప్పారు. చివరకు డిగ్రీ వరకు చదువును కొనసాగించగలిగానని వివరించారు. కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే సంపాదనపై దృష్టి పెట్టాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

2 / 5
పెళ్లిళ్లలో నిర్వహించే ఆర్కెస్ట్రాల్లో డ్యాన్సర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచానని చెప్పారు. ఒక్కో కార్యక్రమానికి తనకు సుమారు రూ.500 నుంచి రూ.1,500 వరకు ఇచ్చేవారని ఆమె తెలిపారు. జబర్దస్త్, ఈవెంట్లు, షూటింగ్‌ల ద్వారా వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకున్నానని తన్మయి తెలిపారు. దాదాపు పదేళ్లపాటు కష్టపడి సంపాదించిన డబ్బుతో గుంటూరులో మూడు అంతస్తుల ఇల్లు నిర్మించుకున్నానని చెప్పారు. ఒకప్పుడు కుటుంబంలో తినడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నుంచి.. తన కుటుంబ సభ్యులను ఒక స్థాయికి తీసుకురాగలిగానని ఆమె అన్నారు.

3 / 5
తన సంపాదనతో కుటుంబాన్ని నిలబెట్టుకోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. జబర్దస్త్ తనకు గుర్తింపు, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాన్ని ఇచ్చినప్పటికీ.. వ్యక్తిగత జీవితం మాత్రం సంతోషంగా లేదని తన్మయి ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.ప్రేమ, స్నేహం, కుటుంబం నుంచి పూర్తి స్థాయి మద్దతు లేకుండా ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పారు.ఒక వ్యక్తిని దాదాపు ఎనిమిదేళ్లపాటు ప్రేమించానని, అతని కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని కూడా ఖర్చు చేశానని తెలిపారు.

4 / 5
అయితే చివరికి తాను మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ప్రేమ, ఆప్యాయత కోసం ఎదురుచూసే పరిస్థితుల్లో కొందరు తమను సులభంగా నమ్మించి మోసం చేస్తారని ఆమె తన అనుభవం ద్వారా వివరించారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కుటుంబం, సమాజం నుంచి తగినంత అంగీకారం, మద్దతు దక్కకపోవడం వల్ల వారు భావోద్వేగంగా మరింత సున్నితంగా మారే అవకాశం ఉంటుందని తన్మయి చెప్పారు. ఎవరో ఒకరు ప్రేమగా మాట్లాడినా, ఆప్యాయత చూపించినా వారికి త్వరగా దగ్గరవుతారని, చివరకు తమ దగ్గర ఉన్నదంతా ఇచ్చేందుకు కూడా సిద్ధపడతారని ఆమె పేర్కొన్నారు.

5 / 5
Follow Us