Rajeev Rayala |
Sep 10, 2021 | 10:40 AM
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కుర్రకారుకు నిద్ర దూరం చేసింది అందాల భామ నభానటేష్. ఈ సినిమాలో నభా వయ్యారాలు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఈ సినిమా తర్వాత నభాకు వరసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది.
తాజాగా నభా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పట్టు పరికినిలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ
కొలనులో తామరపూలు కోస్తూ కొంటె చూపులతో కవ్విస్తుంది నభా. అచ్చమైన తెలుగమ్మాయిలా ఇలా పరికినిలో నభా నటేష్ ఫోటోలకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.