క్రేజీ ఫోజులతో సోషల్ మీడియాలో అగ్గిరాజేస్తుంది ఈ హీరోయిన్. మోడ్రన్, ట్రెడిషనల్ లుక్స్ లో ఫోటోలకు ఫోజులిస్తూ నెటిజన్స్ మైండ్ బ్లాంక్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?
బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది హైదరాబాదీ చిన్నది దివి వైద్య. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్రలో నటించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషించి మరోసారి వెండితెరపై సందడి చేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసినా దివికి మాత్రం సినిమాల్లో అంతగా ఆఫర్స్ రావడం లేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇటీవలే లంబసింగి సినిమాలో కథానాయికగా మెరిసింది దివి వైద్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది దివి. మోడ్రన్ డ్రెస్సులోనైనా, చీరకట్టులోనైనా ఇంప్రెస్ చేయాలంటే ఈ అమ్మడు తర్వాతే ఎవరైనా అనేట్లుగా మారింది.
దివికి ఇన్ స్టాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు క్రేజీ పిక్స్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుగులో దివికి మంచి ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నెట్టింట ఈ బ్యూటీ చాలా యాక్టివ్.