ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Updated on: Sep 21, 2026 | 10:07 PM

బాలీవుడ్‌లో తన డాన్స్, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి.. ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కెనడాకు చెందిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.

1 / 6
బాలీవుడ్‌లో తన డాన్స్, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి.. ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కెనడాకు చెందిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే నేడు స్టార్‌గా కొనసాగుతున్న నోరా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కెరీర్ ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు, అవకాశాల కోసం ఎదురుచూపులు, పారితోషికం చెల్లింపుల విషయంలో ఎదురైన సమస్యలను ఆమె స్వయంగా వెల్లడించారు.

2 / 6
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నోరా ఫతేహి తన కెరీర్ ప్రారంభ దశకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్ని ప్రాజెక్టులు, పాటల్లో పనిచేసినప్పటికీ తనకు రావాల్సిన పారితోషికం పూర్తిగా అందలేదని ఆమె తెలిపారు. తాను పనిచేసిన ప్రాజెక్టులకు సంబంధించిన చెల్లింపులు ఏజెన్సీలకు చేశామని కొందరు నిర్మాతలు చెప్పేవారని, అయితే చివరకు తన చేతికి మాత్రం డబ్బులు వచ్చేవి కావని నోరా పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆమెకు 'బిగ్ బాస్' నుంచి అవకాశం వచ్చిందని చెప్పారు.

3 / 6
తొలినాళ్లలో రియాలిటీ షోలపై తనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదని నోరా వెల్లడించారు. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినప్పుడు మొదట తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పారు. అయితే షో ద్వారా లభించే పారితోషికం గురించి తెలుసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు నోరా తెలిపారు. అదే సమయంలో బిగ్ బాస్ వంటి భారీ ప్లాట్‌ఫామ్ తనకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చిపెట్టగలదని ఆమె అర్థం చేసుకున్నారని వివరించారు.

4 / 6
బిగ్ బాస్‌లోకి వెళ్లేందుకు నోరా కేవలం పారితోషికానికే పరిమితం కాలేదట. తనకు మరో డాన్స్ రియాలిటీ షోలో అవకాశం కల్పించాలని ఆమె షో నిర్వాహకుల ముందు షరతు పెట్టినట్లు తెలిపారు. బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్తున్నందున ఎక్కువ కాలం హౌస్‌లో ఉండకపోవచ్చని ఆమెకు ముందే అంచనా ఉందట. అందుకే ఆ తర్వాత తన కెరీర్‌కు ఉపయోగపడే మరో అవకాశాన్ని ఇవ్వాలని కోరినట్లు నోరా చెప్పారు. తనకు ‘ఝలక్ దిఖ్లా జా’ డాన్స్ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తేనే బిగ్ బాస్‌లోకి వస్తానని నిర్వాహకులకు స్పష్టంగా చెప్పినట్లు ఆమె వెల్లడించారు. చివరకు ఈ ప్రతిపాదనకు ఛానెల్ నుంచి అంగీకారం రావడంతో ఆమె బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టినట్లు నోరా వివరించారు.

5 / 6
బిగ్ బాస్ 9వ సీజన్‌లో నోరా ఫతేహి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సమయంలో మరో కంటెస్టెంట్ ప్రిన్స్ నరులాతో ఆమెకు సంబంధించిన వార్తలు అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. షోలో వీరిద్దరి మధ్య సన్నిహితంగా కనిపించిన సందర్భాలు, ప్రిన్స్ నరులా నోరాకు పూలు, ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసిన ఘటనలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సీజన్‌లో ప్రిన్స్ నరులా విజేతగా నిలవగా, నోరా ఫతేహి మాత్రం బిగ్ బాస్ తర్వాత తన కెరీర్‌లో వేగంగా ముందుకు సాగారు.

6 / 6
బిగ్ బాస్ ద్వారా వచ్చిన గుర్తింపును నోరా ఫతేహి తెలివిగా ఉపయోగించుకున్నారు. బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ తన డాన్స్‌కు ప్రత్యేకమైన బ్రాండ్‌ను ఏర్పరుచుకున్నారు. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు పలు సినిమాల్లో స్పెషల్ డాన్స్ నంబర్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఆమె డాన్స్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా బాలీవుడ్‌ను దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ అభిమానులను సంపాదించుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us