వరుసగా సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తున్న కుర్ర భామ.. కానీ హిట్ మాత్రం లేదు

Updated on: Nov 21, 2026 | 1:29 PM

టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ తమ క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు కొత్త కథలను ఎంచుకుంటూ బిజీగా ఉంటున్నారు

1 / 5
టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ తమ క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు కొత్త కథలను ఎంచుకుంటూ బిజీగా ఉంటున్నారు. అయితే వీరి సినిమాల్లో హీరోయిన్లుగా నటించే అవకాశాలు అందుకోవడం యంగ్ బ్యూటీస్‌కు అంత సులభం కాదు.

2 / 5
కొంతమంది హీరోయిన్లు సీనియర్ హీరోల పక్కన నటించేందుకు ఆసక్తి చూపించరు. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు..

3 / 5
ఆషికా రంగనాథ్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా.. ఆషికా మాత్రం తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

4 / 5
ఆ సినిమా తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే ఛాన్స్ అందుకుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'లో ఆషికా కీలక పాత్రలో కనిపించనుంది. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న ఆషికాకు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

5 / 5
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది ఈ చిన్నది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సైలెంట్ అయిపొయింది. వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత బలపరుచుకునే దిశగా ఈ అమ్మడు అడుగులు వేస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరోలతో టాలీవుడ్ లో ఎప్పుడు నటిస్తుందో చూడాలి. 

Loading...
Unable to load recommendations.
Follow Us