
నిజమైన బంధాలను కోల్పోతారు: మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కొందరు ముందే అక్కడి నుంచి జారుకుంటారు ఆ సమయంలో ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేసేది మనల్ని అభిమానించే వారు మాత్రమే. వారిని దూరం పెడితే.. మీ కష్ట కాలంలో ఒంటరిగా మీకు మిగిలిపోతారు.

కపట వ్యక్తులు మోజులో : నిజంగా మిమ్మల్ని అభిమానించే వారు దూరమైతే, వారి స్థానంలో మీ నుంచి లాగేసి కునేవాళ్లు వస్తారు. వారు ఎంత సేపు మీ సంపదను మీ పక్కన చేరే వారు మాత్రమే.అలాంటి స్నేహితులు మంచి సమయం చూసుకుని మిమ్మల్ని కష్టాల్లో తోసేసి వెళతారు ఆ తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు.

ఇది మీ పతనానికి దారితీస్తుంది : మిమ్మల్ని నమ్మే నమ్మకస్తులను దూరం చేసుకుంటే సర్వం కోల్పోయి నట్లే ఇంకా మీ వ్యాపారంలో సమాజంలో కూడా ఇతరుల వలన మోసపోయే అవకాశం ఉంటుంది ఆ తరువాత ఇది మీ పతనానికి దారితీస్తుంది. కాబట్టి, నమ్మకమైన వారిని దూరం చేసుకోకండి.

మానసిక ఒంటరితనం: మీ చుట్టూ ఎంతమంది ఉన్నా.. మిమ్మల్ని అర్థం చేసుకునే ఆత్మీయులు కరువు అవుతారు ఇంకా మీ జీవితం శూన్యంగా మారుతుంది ఇది తీవ్రమైన అశాంతికి కూడా కారణమవుతుంది. కాబట్టి, మీతో ఉన్నప్పుడే వారి విలువను గుర్తించండి. ఒక్కసారి చేయి జారిపోయాక మీది ఎప్పటికి కాదు.

పశ్చాత్తాపం: ఒకసారి మిమ్మల్ని అభిమానిస్తున్న వ్యక్తిని దూరం చేసుకున్న తరువాత వారి నమ్మకాన్ని, ప్రేమని మళ్లీ సంపాదించడం అసాధ్యం. కాలం ముందుకు వెళ్ళే కొద్దీ మీకు వారి విలువ తెలుస్తూ ఉంటుంది. ఇక ఆ తరవాత బాధపడినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది.