
ట్రైన్ జర్నీ చేసేందుకు ఎక్కువమంది ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటారు. దీని వల్ల కంగారు పడాల్సిన అవసరం ఉండదు. రైలు బయల్దేరే సమయానికి స్టేషన్‌కు చేరుకుని హాయిగా ట్రైన్ ఎక్కొచ్చు. మందే రిజర్వేషన్ చేసుకోవడం వల్ల బెర్త్ దొరుకుతుందా..? లేదా? అనే టెన్షన్ ఉండదు. ముందే బెర్త్ బుక్ అయి ఉంటుంది గనుక ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా ప్రయాణం చేయవచ్చు.

అయితే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు అనివార్య పరిస్థితుల్లో కొంతమంది ప్రయాణం రద్దు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో టికెట్ ఛార్జీలు వృథా అయినట్లేనని చాలామంది అనుకుంటారు. టికెట్ క్యాన్సిల్ చేస్తే కొంతమొత్తంలో ఛార్జీలు కట్ అవుతాయి. దీని వల్ల డబ్బులు నష్టపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ చాలామందికి తెలియని ఒక విషయం ఒకటి ఉంది.

మీ టికెట్‌ను వేరేవారి పేరు మీదకు బదిలీ చేయవచ్చు. మీరు ప్రయాణం చేయనప్పుడు మీ పేరుపై ఉన్న టికెట్‌ను కుటుంబసభ్యుల పేరుపైకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. విద్యార్థులు తమ విద్యాసంస్థలోని ఇతర విద్యార్థులకు, పెళ్లి బృందం అదే టీమ్‌లోని ఇతరులకు, ఎన్‌సీసీ క్యాడెట్లు మరో క్యాడెట్‌కు, ప్రభుత్వ ఉద్యోగులు మరో ఉద్యోగికి టికెట్‌ను బదిలీ చేసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, కుమారుడు, కుమార్తె, భార్య లేదా భర్తకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

కుటుంబసభ్యుల పేరు మీదకు మార్చాలంటే.. ట్రైన్ బయల్దేరడానికి 24 గంటల మందు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి రాతపూర్వకంగా అభ్యర్ధించాలి. మీ టికెట్‌తో పాటు అర్హులైనవారి ఆధారాలను అందించాలి. ఇక విద్యార్థులు 48 గంటల ముందు టికెట్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. విద్యాసంస్థ నుంచి రాతపూర్వకంగా అభ్యర్థన పెట్టాల్సి ఉంటుంది. పెళ్లి బృందాలు 48 గంటల ముందే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఎన్‌పీసీ క్యాడెట్లు 24 గంటల ముందు బదిలీ చేసుకోవాలి.

ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక విధులపై వెళ్తున్నప్పుడు.. ఒకరి టికెట్ మరొకరికి బదిలీ చేయవచ్చు. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే దరఖాస్తు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి మాత్రమే పేరు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. పదే పదే మార్చుకోవడానికి రైల్వే నిబంధనలు అంగీకరించవు.