Gas Cylinders: ఇలాంటి వారికి గ్యాస్ సిలిండర్లు బంద్.. కేంద్రం మరో సంచలన నిర్ణయం.. మూడు నెలలే టైమ్

Updated on: Mar 25, 2026 | 4:55 PM

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పైప్ లైన్ గ్యాస్ కనెక్టివిటీ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పీఎన్‌జీ సదుపాయం ఉంటే అందులోకి తప్పనిసరిగా మారాల్సిందేనని రూల్ విధించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

1 / 5
ఎల్పీజీ గ్యాస్ కొరత క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG) కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఆ విధానంలోకి ప్రజలు తప్పనిసరిగా మారాల్సిందేనని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకు మూడు నెలల గడువు విధించింది. కనెక్టివిటీ కల్పించిన తర్వాత మూడు నెలల్లో మారకపోతే వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తామని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

2 / 5
గ్యాస్ కొరతను తగ్గించడం, పీఎన్‌జీ సౌకర్యాన్ని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పైప్‌లైన్ గ్యాస్ లైన్ ఉన్నచోట అందులోకి మారడానికి ప్రజలు నిరాకరిస్తే.. ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి తగ్గించి పీఎన్‌జీ గ్యాస్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు చేస్తున్నట్ల ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

3 / 5
ఇప్పటికే పీఎన్‌జీ గ్యాస్ వాడేవారు ఎల్పీజీ గ్యా్స్ సిలిండర్లు వాడకుండా ప్రభుత్వం నిషేధం అమల్లోకి వచ్చింది. ఎవరైనా పీఎన్‌జీ వాడుతూ సిలిండర్లను కూడా వాడుతుంటే వాటిని సరెండర్ చేయాలని ఆదేశించింది. అలాగే వారి గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి రెండు గ్యాస్ కనెక్షన్లను కలిగి ఉండటం సరికాదని తేల్చింది.

4 / 5
ఈ క్రమంలో పైప్ లైన్ గ్యాస్ కనెక్టివిటీ ఉన్నచోట ప్రజలు అందులోకి మారాల్సిందేని రూల్ విధించింది. అయితే పీఎన్‌జీ సరఫరా చేయలేని సందర్బాల్లో మాత్రమే వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా చేస్తారు. కానీ ఇందుకోసం ఏజెన్సీ ఎన్‌ఓసీ జారీ చేయాల్సి ఉంటుందని కేంద్రం కొత్త గైడ్ లైన్స్‌లో పేర్కొంది. ఎక్కువమందికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేసేందుకు ఈ చర్య ఉపయోగపడనుంది.

5 / 5
అటు పైప్ లైన్ గ్యాస్ నెట్‌వర్క్‌కు సులభంగా ఆమోదాలు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. నిర్దేశిత గడువులోగా అనుమతులు జారీ చేయాలని అధికారులు ఆదేశించింది. ఒకవేళ ఆమోదించడం ఆలస్యమైన క్రమంలో అనుమతులు మంజూరైనట్లుగా పరిగణించబడతాయని తెలిపింది. నివాస సముదాయాల్లో మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలి. ఇఖ చివరి దశ పీఎన్‌జీ కనెక్షన్లను 48 గంటల్లోపు పూర్తి చేయాలి.

Follow Us