Papaya Skin Care: నిగారింపైన చర్మం కోసం.. బొప్పాయితో ఫేషియల్ ఇలా చేశారంటే..

Updated on: Nov 23, 2025 | 12:40 PM

బొప్పాయి తినడంతో పాటు చర్మానికి కూడా అప్లై చేసుకోవచ్చునని మీకు తెలుసా..? అవును బొప్పాయితో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కావాలని కోరుకునే వారు బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ ట్రై చేస్తే బెస్ట్‌ రిజల్ట్స్‌ చూస్తారు. యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చర్మంపై తేమను ఉంచుతాయి. బొప్పాయిని చర్మానికి రాయడం వల్ల చర్మంపై పగుళ్ల సమస్య రాదు. బొప్పాయిలో బీటా-కెరోటిన్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మచ్చలు, స్కిన్ పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అందమైన, పట్టులాంటి మెరిసే చర్మం కోసం బొప్పాయిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మొటిమల మచ్చలు, మోచేతులు, మోకాళ్లపై వంటి నల్లటి చర్మపు మచ్చలకు అద్భుతమైన నివారణగా పని చేస్తుంది. అయితే కొంతమంది చర్మానికి బొప్పాయి సరిపోదు. దీనిని వాడటం వలన అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు కచ్చితంగా నిపుణులను సంప్రదించాలి. మార్కెట్లో దొరికే ఉత్పత్తులను వాడి చర్మాన్ని పాడుచేసుకునే బదులుగా.. సహజంగా దొరికే పదార్థాలతో చర్మాన్ని కాపాడుకోవచ్చు.

2 / 5
బొప్పాయి వాక్సింగ్, థ్రెడింగ్ ఇబ్బందిని నివారించడంలో సహాయపడుతుంది. ఇది ముఖ వెంట్రుకల కుదుళ్లను బలహీనపరుస్తుంది. తదుపరి పెరుగుదలను నిరోధిస్తుంది. బొప్పాయి అనేది చర్మపు మచ్చలను తేలికపరచడానికి, సూర్యరశ్మి వల్ల ఏర్పడే టాన్‌ను తొలగించడానికి సహాయపడుతుంది.

3 / 5
బొప్పాయి ఎంజైమ్‌లు బీటా-కెరోటిన్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ వంటి కారకాలకు మూలం. ఇది చర్మపు మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్ చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది. మృదువుగా చేస్తుంది.

4 / 5
బొప్పాయి చర్మాన్ని కాంతివంతంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది. బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇది చర్మం సహజ తేమను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మొటిమల మచ్చలు, మోచేతులు, మోకాళ్లపై వంటి నల్లటి చర్మపు మచ్చలకు అద్భుతమైన నివారణగా పని చేస్తుంది.

5 / 5
బొప్పాయిలో లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ముఖం, చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి బొప్పాయి గుజ్జును రుద్దడం, రసం తాగడం వల్ల యవ్వనాన్ని కాపాడుతుంది. బొప్పాయిలో ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఉపరితలం నుండి చనిపోయిన, దెబ్బతిన్న కణాలు, కణజాలాలు, పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది.