మన్యంలో మంచు ముసుగు.. అరకు అందాలు అదరహో

Updated on: Nov 29, 2026 | 2:46 PM

అరకులోయ సహజసిద్ధ ప్రకృతి అందాల కేరాఫ్.. ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలకు తోడు. ఈ సీజన్లో పొగమంచు సోయగం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రకృతి సుందర దృశ్యాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు. అరకులోయ తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. దుప్పటిలా కప్పుకున్న మంచు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

1 / 5
అరకులోయ తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. దుప్పటిలా కప్పుకున్న మంచు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. నవంబర్ డిసెంబర్ మధ్యలో చాలా మంది అరకు టూర్‌కు వెళ్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఇక అరుగు అందాల గురించి వర్ణించ తగదు.

2 / 5
అందమైన లోయలు, పూలతోటలు, సరస్సులు, పచ్చని చెట్లు చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నట్లు ఉంటుంది. ఇక ప్రస్తుతం అరకులో మంచు సందడి మొదలైంది. దీంతో వేలాది మంది పర్యాటకులు అరకు వెళ్లి మాడగడ సన్ రైజ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

3 / 5
అరకులోయ పరిసర ప్రాంతాలపై ఆదివారం మంచు ముసుగేసింది. మంచు సోయగం సందర్శకులను మైమరపించింది. మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ లోయంతా మంచు మేఘాలు పాల సముద్రాన్ని తలపించింది. మంచు తెరలను చీల్చుకుంటూ వచ్చే సన్ రైజ్ సందర్శకులను మంత్రముగ్ధుల్నిజేసింది.

4 / 5
సందర్శకులు ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ధింసా కళాకారులు నృత్యాలు చేస్తూ పర్యాటకులను ఆహ్వానం పలికారు. కళాకారులతో కలిసి సందర్శకులు ఆడి పాడారు. సుంకర మెట్ట కాఫీట్రైయల్‌ వద్ద కెనోపివాక్‌ చేస్తూ సందర్శకులు ఎంజాయ్‌ చేశారు.

5 / 5
అదేవిధంగా అరకులోయలో ట్రైబల్‌ మ్యూజియం, పద్మా పురం గార్డెన్‌లను పర్యాటకులు సందర్శించి ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారం కావడంతో అరకు పర్యటకుల సంఖ్య పెరిగింది. హోటల్లో లాడ్జిలకు డిమాండ్ ఏర్పడింది.

Loading...
Unable to load recommendations.
Follow Us