Viral News: కళ్లు మూసుకున్నా చూడగలవు.. ఈ జీవుల సూపర్ పవర్స్ గురించి తెలిస్తే..

Updated on: Apr 26, 2026 | 7:21 PM

ప్రకృతి సృష్టిలో మనకు తెలియని వేలకొద్దీ రహస్యాలు ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ప్రాణి ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు తెరవాల్సిందే. కానీ కొన్ని విచిత్రమైన జీవులు కళ్లు మూసుకున్నా లేదా వాటికి కనురెప్పలు లేకపోయినా తమ చుట్టూ జరుగుతున్న కదలికలను ఖచ్చితంగా గుర్తించగలవుట. చీకటిలో కూడా ఇవి తమ వేటను పసిగట్టవట. ఆ జంతువులు ఏవో తెలుసుకుందాం పదండి.

1 / 6
 ఒంటె : ఇవి మనకు ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే ఎడారిలో జీవించడానికి ఒంటె శరీరం ప్రత్యేకంగా నిర్మించబడి ఉంటుంది. ఒంటె కళ్లకు మూడు కనురెప్పలు ఉంటాయి. వాటిలో ఒకటి పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. బలమైన ఇసుక తుఫానులు వచ్చినప్పుడు ఒంటె ఈ పారదర్శక రెప్పను మూసుకుంటుంది. దీనివల్ల కంటిలోకి ఇసుక వెళ్లకుండా ఉంటుంది. అయితే ఈ సందర్భంలో కళ్లు మూసుకున్నా కూడా ఒంటె దారిని స్పష్టంగా చూడగలుగుతుంది.

2 / 6
ఊసరవెల్లి: ఇది మనకు ఎక్కువగా చెట్లపై కనిపిస్తుంది. వీటి కళ్ల నిర్మాణం మిగతా జీవుతల పోల్చుతే చాలా విభిన్నంగా ఉంటుంది. దీని కంటి పై పొరలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది, అది దానికి వ్యూయింగ్ విండోలా పనిచేస్తుంది. ఊసరవెల్లి కళ్లు మూసుకున్నా, ఆ చిన్న రంధ్రం ద్వారా చుట్టుపక్కల కదలికలను స్పష్టంగా చూడగలదు. ఇది తన వేటను పట్టుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.

3 / 6
స్కింక్ బల్లి : స్కింక్ అనేది బల్లి జాతికి చెందిన జీవి. వీటికి సాధారణ కనురెప్పలకు బదులుగా పారదర్శకమైన పొర వంటి కవచం ఉంటుంది. ఈ పొర కళ్లను రక్షించడమే కాకుండా, కళ్లు తెరవకుండానే బయటి ప్రపంచాన్ని చూడటానికి సహాయపడుతుంది. శత్రువుల నుండి తప్పించుకోవడానికి దీనికి ఇది ఒక గొప్ప వరం అనే చెప్పవచ్చు.

4 / 6
ఓరియంటల్ బే గూబ : ఇది గుడ్లగూబ జాతికి చెందినది. ఈ రకం గూబలు రాత్రి సమయంలో చాలా చురుగ్గా ఉంటాయి. వీటి కనురెప్పలకు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇవి కళ్లు మూసుకున్నప్పటికీ, ఆ రంధ్రాల ద్వారా బయటి కదలికలను గుర్తించగలవు. అందుకే చీకటిలో కూడా ఇవి తమ వేటను చాలా ఖచ్చితంగా పట్టుకుంటాయి.

5 / 6
పాముల రహస్యం: అయితే చాలా మంది పాముల కళ్లను చూసి ఉంటారు కానీ.. వాటికి కనురెప్పలు ఉండవనే విషయం చాలా మంది గమనించరు. అవును పాములకు అసలు కనురెప్పలే ఉండవు. వాటి కళ్లపై పారదర్శకమైన చర్మపు పొర ఉంటుంది. ఈ పొర కళ్లను రక్షించడమే కాకుండా, పాము నిరంతరం చూస్తూ ఉండటానికి సహాయపడుతుంది. అందుకే పాములు కళ్లు ఆర్పకుండా చూస్తున్నట్లు మనకు అనిపిస్తాయి.

6 / 6
డాల్ఫిన్లు, తిమింగలాలు: సముద్రాల్లో నివసించే డాల్ఫిన్‌, తిమింగలాలు కూడా కళ్లు మూసి బయట ప్రపంచాన్ని చూడగలవు. ఇవి యూనిహెమిస్ఫెరిక్ స్లీప్ అనే వింత పద్ధతిని పాటిస్తాయి. అంటే, ఇవి నిద్రపోయేటప్పుడు మెదడులో ఒక భాగం మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది, మరో భాగం మేల్కొనే ఉంటుంది. ఒక కన్ను మూసినప్పుడు మరొక కన్ను తెరిచి ఉంటుంది. దీనివల్ల అవి నిద్రలో ఉన్నా చుట్టుపక్కల ఉండే ప్రమాదాలను గమనించగలవు.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు)

Follow Us